Rythu Bandhu Scheme : రైతు బంధు పట్ల ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ

సంక్షేమ పథకాల చెల్లింపులు నవంబర్ 2 లోగా అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే విడుదల చేయాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు

Published By: HashtagU Telugu Desk
Congress Raithubandh

Congress Raithubandh

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) మరోసారి బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిఆర్ఎస్ – కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ని బిఆర్ఎస్ టార్గెట్ చేయడం తో..రేవంత్ సైతం ఎక్కడ తగ్గడం లేదు. మీరా…మీమా అన్నట్లు ముందుకు వెళ్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ..బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతు బంధు (Revanth Reddy ) విషయంలో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. తెలంగాణలో ఎన్నికల సమాయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బంధుపై నిఘా ఉంచాలని కోరారు.

సంక్షేమ పథకాల చెల్లింపులు నవంబర్ 2 లోగా అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే విడుదల చేయాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్దిష్టమైన డిమాండ్ అన్నారు. సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. రిటైర్ అధికారులను తక్షణమే తొలగించాలని చెప్పామని.. రిటైర్ అధికారులతో నయా రాజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారని రేవంత్ ఆరోపించారు. కొందరు అధికారులు బీఆరెస్ ఎన్నికల నిర్వహణ టీమ్ లా పనిచేస్తున్నారన్నారు.

అలాగే మేడిగడ్డ విషయం ఫై కూడా రేవంత్ ఘాటుగా స్పందించారు. మేడిగడ్డ కాదు.. కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. హరీష్, కేటీఆర్ బిల్లా రంగా లాంటివారు.. కేసీఆర్ చార్లెస్ శోభారాజ్ లాంటి వారని।. వాళ్ళేం చేశారో చెప్పకుండా కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ లేఖపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి మంచినీళ్లు, ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో.. అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా అని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని ఎద్దేవా చేశారు. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయిందని విమర్శించారు. పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరని మండిపడ్డారు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా అని అన్నారు.

Read Also : Janasena – TDP Joint Action Committee : మూడు రోజులపాటు టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు

  Last Updated: 26 Oct 2023, 03:54 PM IST