Site icon HashtagU Telugu

Revanth Reddy Missing Posters : “రేవంత్ మిస్సింగ్” పోస్టర్ల కలకలం.. బీఆర్ఎస్ పనే అంటున్న కాంగ్రెస్

Revanth Reddy Missing Posters

Revanth Reddy Missing Posters

Revanth Reddy Missing Posters : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కనిపించడం లేదంటూ మల్కాజిగిరి నియోజకవర్గంలో పలుచోట్ల పోస్టర్లు ఏర్పాటయ్యాయి. ఓ ఎంపీగా ఎప్పుడైనా నియోజకవర్గంలో రేవంత్ పర్యటించారా అని ఆ పోస్టర్లలో ప్రశ్నించారు.  రేవంత్ కు వ్యతిరేకంగా ఈ పోస్టర్ల ఏర్పాటులో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రేవంత్ రెడ్డి  ప్రస్తుతం లోక్ సభ సభ్యుడి హోదాలో .. మణిపూర్ హింసాకాండపై, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసేందుకే ఢిల్లీలో ఉన్నారని అంటున్నారు.  ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన  కీలక బిల్లులను లోక్ సభలో ప్రవేశ పెడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వైఖరికి అనుగుణంగా ఓటింగ్ లో పాల్గొనేందుకు ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉందని నేతలు చెప్పారు. వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న తరుణంలో బాధిత కుటుంబాలకు రూ.10వేలు  చొప్పున సాయం అందించాలనే డిమాండ్  కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిందని హస్తం పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

Also read : Ketika sharma : చీరకట్టులో మైండ్ బ్లోయింగ్ చేస్తున్న కేతిక అందాలు

అయితే, కాంగ్రెస్ ఆందోళనలను బీఆర్ఎస్ తిప్పికొట్టింది. ఈ కఠిన సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని, ప్రజలకు సహాయం చేయాలని హితవు పలికింది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రజల్లో తిరుగుతూ వారికి భరోసా ఇస్తున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, సహాయక సిబ్బందికీ సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయని..  రాష్ట్ర ప్రభుత్వం ఓ హెలికాప్టర్ కేటాయించాలని సీతక్క డిమాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Also read : Mumbai: విమానంలో డాక్టర్ పై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. చివరికి?