CM Revanth Reddy:రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్రమంత్రులను కలుస్తూ..రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో భేటి అయ్యారు. సోనియా గాంధి నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది. రైతు రుణమాఫీ , వరంగల్ సభ అంశాలపై రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. అంతేకాకుండా.. సభకు రావాల్సిందిగా రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. మరోవైపు.. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ, క్యాబినెట్ విస్తరణ పై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ భేటిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు ఈరోజు ఉదయం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ(Sonia Gandhi)తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటి అయ్యారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై సోనియా గాంధీతో చర్చించారు. రైతులకు మొదటి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియాగాంధీ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వివరించారు. కాగా, ఇంతకుముందు కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయిన విషయం తెలిసిందే.
Read Also: Nitin and Chaitanya : నితిన్, చైతన్య.. ఇపుడు ఏం చేస్తారు..?