Telangana : కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం ఎవరితరం కాదు – రేవంత్ రెడ్డి

పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో అనడం ఏంటి?. బీఆర్ఎస్ ఏం చెప్పినా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. చేరికలు కంటిన్యూగా కొనసాగుతాయి.

Published By: HashtagU Telugu Desk
Revanth Fire On Brs

Revanth Fire On Brs

తెలంగాణ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార (BRS) – ప్రతిపక్ష పార్టీల (Congress & BJP) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు..కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ గా పెట్టుకున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీ పధకాలు ప్రకటించిందో..ప్రజల్లో కాంగ్రెస్ గాలి వీస్తుంది. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ ఫై విమర్శలు , సెటైర్లు వేస్తూ వస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేస్తుండడంతో రేవంత్ సైతం ఎక్కడ తగ్గడం లేదు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా రేవంత్ (Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ‘బీఆర్ఎస్ పార్టీ (BRS)ని 25 సీట్లు దాటనివ్వం. ఈ నెలలో కాంగ్రెస్ మేనిఫెస్టో (Congress Manifesto) ఉంటుంది. మేనిఫెస్టో (Manifesto)లో మరిన్ని ఆయుధాలు బయటపెడతాం. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్ళు మళ్ళీ మేనిఫెస్టో అనడం ఏంటి?. బీఆర్ఎస్ ఏం చెప్పినా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. చేరికలు కంటిన్యూగా కొనసాగుతాయి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం ఎవరితరం కాదు. అధికారం కోల్పోతామని కేటీఆర్, హరీష్ రావు (KTR, Harish Rao) భయపడి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు (Congress Candidates) రెడీ అయ్యాయి.. ఏఐసీసీ ఆమోదం తెలపగానే ప్రకటిస్తాం. కేసీఆర్ మానస పత్రికల్లో రోజూ నా వార్తలు వేస్తున్నారు. దాన్ని బట్టి నన్ను వాళ్ళు ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. 19% అన్ డిసైడెడ్ ఓట్లు తెలంగాణలో ఉన్నాయి. అదంతా కాంగ్రెస్ పార్టీకే వస్తుంది. రాష్ట్రంలో ఏ మహిళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేదు’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read Also : Roja Blue Film Issue : మిర్యాల‌గూడ‌లో రోజా ఎవ‌రితో గ‌డిపారు? `బ్లూ ఫిల్మ్ ` నిజ‌మేనా?

  Last Updated: 02 Oct 2023, 04:04 PM IST