Revanth Reddy Invitation : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరణ ఆహ్వాన పత్రిక చూసారా..?

విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ పేర్కొన్నారు

Published By: HashtagU Telugu Desk
Revanth Inv

Revanth Inv

అనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy ) రేపు తెలంగాణ రాష్ట్ర సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకరణం చేయబోతున్నారు. రాజకీయాల్లో కేవలం 20 ఏళ్ల అనుభవం ఉన్న రేవంత్..ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్ని పాలించబోతున్నాడు. రేపు మధ్యాహ్నం LB స్టేడియం లో ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా , రాహుల్ , ప్రియాంక లతో పాటు పలువురు హాజరుకాబోతున్నారు. అలాగే ఇతర రాజకీయ పార్టీల నేతలకు, పలు రాష్ట్రాల సీఎం లకు , మాజీ సీఎంలకు ఆహ్వానం పలికారు. ఇదిలా ఉంటె ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక (Revanth Reddy Invitation Card) ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. రేవంత్ సైతం.. ఈ కార్యక్రమానికి ప్రజలను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ పేర్కొన్నారు. అందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీనవర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు కోసం డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాలని అందర్నీ ఆహ్వానించారు.

Read Also : Pushpa Keshava : పుష్ప నటుడు అరెస్ట్ ..

  Last Updated: 06 Dec 2023, 07:42 PM IST