Most Powerful Indians : అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిఆర్ఎస్ (BRS) పార్టీ ని అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి..తెలంగాణ రెండో సీఎం గా వార్తల్లో నిలిచినా రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన 40 మంది భారతీయుల్లో (Most Powerful Indians ) చోటు దక్కించుకొని మరోసారి యావత్ మీడియా లో చర్చగా మారాడు. We’re now on WhatsApp. Click to Join. ది […]

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Most Powerful In

Cm Revanth Most Powerful In

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిఆర్ఎస్ (BRS) పార్టీ ని అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి..తెలంగాణ రెండో సీఎం గా వార్తల్లో నిలిచినా రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన 40 మంది భారతీయుల్లో (Most Powerful Indians ) చోటు దక్కించుకొని మరోసారి యావత్ మీడియా లో చర్చగా మారాడు.

We’re now on WhatsApp. Click to Join.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన లిస్ట్ లో ప్రధాని మోడీ అత్యంత శక్తివంతమైన భారతీయుడిగా మొదటిస్థానంలో కొనసాగుతుండగా..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 39 వ స్థానం దక్కించుకోవడం విశేషం. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండో స్థానంలో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ (అధినేత) మోహన్ భగవత్ మూడో స్థానంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కంటే ఒక స్థానం ముందు అంటే 38వ స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నారు.

మొత్తం 40 మంది సభ్యుల లిస్ట్ ఇలా ఉంది..

1. మోడీ, భారత ప్రధాని
2. అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
3. మోహన్ భగవత్, ఆరెస్సెస్ చీఫ్
4. డీవై చంద్రచూడ్, భారత ప్రధాన న్యాయమూర్తి
5. ఎస్ జైశంకర్, విదేశాంగ మంత్రి
6. యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
7. రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
8. నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
9. జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
10. గౌతం అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్
11. ముఖేష్ అంబానీ, రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
12. పీయూష్ గోయల్, వాణిజ్య మంత్రి, సభా నాయకుడు, రాజ్యసభ
13. అశ్విని వైష్ణవ్, రైల్వే, టెలికాం అండ్ ఐటీ శాఖ మంత్రి
14. హిమంత బిస్వా శర్మ, అసోం ముఖ్యమంత్రి
15. మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
16. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకుడు
17. అజిత్ దోవల్, జాతీయ భద్రతా సలహాదారు
18. అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
19. శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్
20. హర్దీప్ సింగ్ పూరి, కేంద్రమంత్రి
21.సంజీవ్ ఖన్నా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
22. సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి
23. మన్సుఖ్ మాండవియా, కేంద్రమంత్రి
24. నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి
25. ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి
26. నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ అండ్ వ్యవస్థాపకురాలు
27. షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటుడు
28. నటరాజన్ చంద్రశేఖరన్, టాటా గ్రూప్ చైర్‌పర్సన్
29. సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు
30. రాహుల్ నవీన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
31. భూపేందర్ యాదవ్, కేంద్రమంత్రి
32. అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి
33. ధర్మేంద్ర ప్రధాన్, కేంద్రమంత్రి
34. దత్తాత్రేయ హోసబాలే, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి
35. జై షా, బీసీసీఐ కార్యదర్శి
36. మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు
37. అజీమ్ ప్రేమ్‌జీ, విప్రో వ్యవస్థాపకుడు
38. విరాట్ కోహ్లీ, క్రికెటర్
39. రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
40. వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లు కొనసాగుతున్నారు.

Read Also : Ex IAS Officer Imtiaz : వైసీపీలో చేరిన మాజీ IAS.. కర్నూల్ నుండి పోటీ..

  Last Updated: 29 Feb 2024, 04:30 PM IST