Revanth Reddy: TSPSC ఎఫెక్ట్.. రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

  • Written By:
  • Updated On - March 24, 2023 / 12:59 PM IST

టీఎస్పీఎస్సీ వ్యవహారం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతూనే ఉంది. అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం పరస్పర ఆరోపణలతో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. TSPSC పరీక్షా పత్రాల లీకేజీని నిరసిస్తూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ నిరుద్యోగ మహాదీక్షకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో నిరుద్యోగ మహాదీక్షకు అనుమతి లేదని పోలీసులు విద్యార్థి సంఘాలను అడ్డుకున్నారు. అలాగే జూబ్లీహిల్స్ లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆయన నిరుద్యోగ మహాదీక్షకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

నిన్న సాయంత్రం నుంచే విద్యార్థులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరుద్యోగ మహాదీక్షకు విద్యార్థులు పిలుపునిచ్చారు. అయితే రేవంత్ రెడ్డి హాజరయ్యేందుకు సిద్దమైన క్రమంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఓయూ స్టూడెంట్స్ దీక్ష నేపథ్యంలో యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులు వెనక్కి తగ్గదే లేదని, కార్యక్రమం చేపట్టి తీరుతామని చెప్పడంతో ఓయూలో హైటెన్షన్ నెలకొంది.