Revanth Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై రేవంత్ రెడ్డి రియాక్షన్

ఢిల్లీ లిక్కర్ స్కాంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

Published By: HashtagU Telugu Desk
Revanth reddy

ఢిల్లీ లిక్కర్ స్కాంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అందరినీ ఢిల్లీకి పిలిపించి విచారణ చేస్తున్నప్పుడు కవితకు మాత్రం మినహాయింపు ఎందుకు? కవితను ఇంట్లోనే విచారణ చేస్తాం అనడంలో అంతర్యం ఏమిటి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసలు విషయం ఏంటో ఇక్కడే తెలుస్తోందని అన్నారు.

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ లు బెంగాల్ ఫార్ములాను అమలు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు ఓ వీధి నాటకాన్ని తలపిస్తోందని అభిప్రాయపడ్డారు. కుమ్మక్కు రాజకీయాలు అంటే ఇవేనని, వీటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి చాలా ఇచ్చారని, ఇంకా ఇవ్వడానికి తెలంగాణ ప్రజల దగ్గర ఏమి లేదని రేవంత్ రెడ్డి అన్నారు.

  Last Updated: 03 Dec 2022, 05:09 PM IST