తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చింది..ఎల్లుండి (డిసెంబర్ 07) న రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కొత్త సర్కార్ జర్నలిస్టులకు (Generalist) గుడ్ న్యూస్ తెలిపి అందరిలో సంతోషం నింపారు. జర్నలిస్టులను సెక్రటేరియట్‌లోకి అనుమతించాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడగానే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొత్త సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు జర్నలిస్టు అధ్యయన వేదిక నేతలు వేణుగోపాల్ రెడ్డి, సాదిక్‌లు హర్షం వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సచివాలయంలో జర్నలిస్టులకు ఎంట్రీ లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సామాన్యులతో పాటు జర్నలిస్టులకు ఎంట్రీ కల్పించబోతున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం బయటే ఒక హాల్‌లో మీడియా పాయింట్‌ను ఇచ్చారు. దీంతో చాలా మంది రిపోర్టర్లు తమకు ఎంట్రీ ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు శుభవార్త చెప్పడం గమనార్హం.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ని భారీ మెజార్టీ తో గెలిపించారు. 64 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఏ పార్టీ మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఎల్లుండి సీఎం గా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
Read Also : Revanth Reddy Anu Nenu : రేవంత్ రెడ్డి అను నేను..