Site icon HashtagU Telugu

CM Revanth : ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు గుడ్ న్యూస్

Revanth Auto

Revanth Auto

CM Revanth : ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌లకు రూ.5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులతో భేటీ అయిన సీఎం రేవంత్ వారి  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు సంబంధించిన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. దీనిపై రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లును  ప్రవేశపెడతామని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులకు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్(CM Revanth) పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన గ్రామసభలలో ఆరోగ్యశ్రీ కార్డులకు అప్లై చేయాలని వారికి సూచించారు.4 నెలల క్రితం కుక్క తరిమితే భవనం పైనుంచి పడి మృతిచెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ. 2 లక్షలు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Also Read: Covid Cases : ఏపీ, తెలంగాణలో మళ్లీ కరోనా దడ.. కేసులు ఇలా..