Revanth Reddy: దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి, పెట్టుబడులే సీఎం లక్ష్యం

  • Written By:
  • Updated On - January 10, 2024 / 01:58 PM IST

Revanth Reddy: ఇప్పటికే సీఎం గా నెలరోజుల పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టబడులపై మరింత ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గోద్రెజ్, అదానీ, ఇతర ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. లోక్ సభ ఎన్నికల ముగింట రేవంత్ పెట్టుబడులపై మరిన్ని ద్రుష్టి సారించబోతున్నారు. జాబ్ నొటిఫికేషన్ తో పాటు వివిధ కంపెనీలను తీసుకొచ్చినట్టయితే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని రేవంత్ భావన. అందుకే వివిధ కంపెనీలతో  రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. పారిశ్రామిక, ఐటి విధానాలను ఆవిష్కరించడానికి ప్రభుత్వం శ్రద్ధగా పని చేస్తోంది.  పెట్టుబడులను ఆకర్షించే వ్యూహాత్మక ఎత్తుగడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్‌కు తన తొలి విదేశీ టూర్ కు వెళ్తుండటం ఆసక్తిని రేపుతోంది.

ఈ సదస్సులో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు రాబట్టే లక్ష్యంతో పాల్గొంటారు. ఈ నెల 15 నుంచి 18 వరకు జరగనున్న దావోస్ సదస్సు ఏటా ప్రపంచ పారిశ్రామికవేత్తలు, బహుళజాతి కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులతో కూడిన విభిన్న సమావేశాన్ని ఆకర్షిస్తుంది. ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదానీ వంటి ప్రముఖులు భారతదేశం నుండి మామూలుగా హాజరవుతారు. కాగా ఇక ధరణి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఐదుగురి సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమీటీ కన్వీనర్ గా సీసీఎల్ఏ సభ్యుడు ఉంటారు. సభ్యులుగా ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వొకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్ అంశాలను అధ్యయనం చేయనుంది. అలాగే వెబ్ సైట్ పునర్నిర్మాణంపై సిఫార్సులు చేయనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణికి వస్తున్న అత్యధిక ఫిర్యాదుల్లో ధరణికి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతీ గ్రామం నుంచి ధరణి బాధితులు తప్పకుండా ఉంటున్నారు. ధరణి పోర్టల్ వల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే పోర్టల్ అధ్యయనానికి ధరణిలోపాలపై కమిటీని వేశారు రేవంత్.

Also Read: Rajinikanth: రజినీకాంత్ లాల్ సలామ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!