Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ చింతకు ఉరేసుకొని సచ్చినా ధరణి రద్దు చేస్తాం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తాజాగా CWC సమావేశాల అనంతరం మొదటి సారి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టగా ఇందులో ధరణి గురించి మాట్లాడాడు.

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 08:59 PM IST

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్(Congress) CWC సమావేశాలు ఘనంగా నిర్వహించి అనంతరం నిన్న తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 6 గ్యారెంటీ హామీలంటూ ఎలక్షన్స్ టార్గెట్ గా దూసుకెళ్తుంది. మొదట్నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి(Dharani) తీసేస్తాం అనే చెప్తున్నారు. తాజాగా CWC సమావేశాల అనంతరం మొదటి సారి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టగా ఇందులో ధరణి గురించి మాట్లాడాడు.

రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. CWC సమావేశాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు. 70 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో CWC సమావేశాలు జరిగాయి. నేను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు CWC సమావేశాలు హైదరబాద్లో జరగడం సంతోషంగా ఉంది. ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యూహంపై చర్చించాం. CWC సమావేశాల్లో ఇండియా కూటమి పాత్రపై చర్చ జరిగింది అని తెలిపారు.

అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ.. వంద రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. మరో వంద రోజుల్లో 6 గ్యారెంటీ స్కీంలు అమలు చేస్తాం. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొట్టి, బిల్లు పేపర్లు చింపేసినా సోనియా తెలంగాణ ఇచ్చింది. సోనియాని గౌరవంగా స్వాగతించి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ విజ్ఞత ఉన్నట్టు అనిపించేది. మా సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. కేసీఆర్, కేటీఆర్ చింతకు ఉరేసుకొని సచ్చినా ధరణి రద్దు చేస్తాం. ధరణి కేసీఆర్ కుటుంభానికి ఏటీఏం లాగా మారింది. దొరల దోరణికి ప్రతిరూపమే ధరణి. తెలంగాణలో భూ సమస్య ప్రధానమైంది. భూమి కోసమే సాయుధపోరాటం జరిగింది అని అన్నారు. ఇక అటు బీఆర్ఎస్ నాయకులు ధరణి ఉంటేనే రైతులకు మంచిది అని, ధరణిని తీసే ప్రసక్తే లేదని మొదటి నుంచి చెప్తున్నారు.

 

Also Read : Vijayashanthi : సోనియా అంటే తనకెంతో అభిమానమంటున్న విజయశాంతి