Site icon HashtagU Telugu

Revanth Reddy : మామ అల్లుడు ప్రజల ఉసురు తీస్తున్నారు..!!

Revanth Reddy

Revanth Reddy

కేసీఆర్, హారీశ్ రావులపై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వీరిద్దరూ కలిసి ప్రజలు ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో 34 మంది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారని…వాళ్లంత నిరుపేద కుటుంబానికి చెందినవారన్నారు. అల్లుడు హరీశ్ సమర్థుడని మామ ఆరోగ్య శాఖ అప్పగించారని ఫైర్ అయ్యారు. ఆయన హయాంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.

సర్కారీ దవాఖానాలపై సర్కార్ గొప్పలు చెబుతోంది కానీ…కార్పొరేట్ తరహాలోనే ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తున్నాయన్నారు. 34మందికి గంటలోనే ఆపరేషన్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ కు పొలిమెరలోనే ఈ ఘటన జరిగిందన్నారు. ఎన్ని రోజులు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించిందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఘటన అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి నాణ్యమైన వైద్యం అందితే..కార్పొరేట్ ఆసుపత్రుకి ఎందుకు తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. మరణించిన వారికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. వారి పిల్లల చదువును ప్రభుత్వమే బాధ్యతగా తీసుకోవాలన్నారు. కేసీఆర్ బీహార్ పర్యట చేయడం కాదు…తెలంగాణలో మరణిస్తున్న వారిని పట్టించుకోవాలి. మరణించిన వారి కుటుంబాలను సర్కార్ ఆదుకునేంత వరకు కాంగ్రెస్ వారికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.