Site icon HashtagU Telugu

Revanth Reddy : కేసీఆర్..బండి సంజయ్ లపై రేవంత్ ఫైర్..

Revanth Bandi Sanjay Kcr

Revanth Bandi Sanjay Kcr

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీఎం కేసీఆర్ , బీజేపీ నేత బండి సంజయ్ లపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో రేవంత్ తన దూకుడు ను మరింత పెంచాడు. ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థుల ప్రచారాన్ని ముమ్మరం చేయించడం తో పాటు..బిఆర్ఎస్ , బిజెపి లపై మాటల తూటాలు వదులుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) లోపాలను ఎత్తిచూపుతూ కేసీఆర్ (KCR) ఫై విమర్శలు చేస్తున్నారు రేవంత్.

We’re now on WhatsApp. Click to Join.

కాళేశ్వరంలో ఇంత ఉపద్రవం జరిగినా కేసీఆర్ మాట్లాడడం లేదని , కాళేశ్వరంలో అవినీతి పూర్తిగా బట్టబయలు అవుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. డిజైన్ల లోపాలు, నాసిరకం పనులు జరిగాయని ప్రభుత్వానికి తెలుసని , కాళేశ్వరం జరిగిన అవినీతి కేంద్రం ఎందుకు విచారించదని ప్రశ్నించారు. దీనిపై CBI తో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర ఎందుకు మౌనంగా ఉంటోందని బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇదే క్రమంలో బండి సంజయ్ (Bandi Sanjay) ఫై కూడా రేవంత్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అధికారం లోకి వస్తే చర్యలు తీసుకుంటా అని చెప్పడం ఏంటి? అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాదు.. విచారణ జరపం అని చెప్పదలుచుకున్నదా బీజేపీ అని ప్రశ్నించారు. ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో కేసీఆర్ దోపిడీకి తెర లేపారన్నారు. మెడిగడ్డ ప్లానింగ్ వేరు.. డిజైన్ అనుకున్నది ఒకటి చేసింది ఒకటి అని మండిపడ్డారు. నేనే ఆలోచన చేసి.. మెదడు, రక్తం ధారపోసి కట్టిన అన్నారు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కుంగి పోగానే.. సాంకేతిక నిపుణుల మీద తోసి పనిలో పడ్డారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ని పదవి నుండి తప్పించిన తర్వాత బుర్ర పని చేస్తున్నట్టు లేదని టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also : Free Ration Scheme : రేషన్ దారులకు గుడ్ న్యూస్ తెలిపిన మోడీ..మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్