Site icon HashtagU Telugu

TS : కేసీఆర్ మోకాళ్లచిప్పలపై లాఠీలతో కొట్టుకుంటూ తీసుకెళ్ళే రోజు వస్తుంది – రేవంత్

Revanth Kcr

Revanth Kcr

సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫై నిప్పులు చెరిగారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ఇటీవల పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల పొందిన యువతీయువకులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..నల్గొండ బిఆర్ఎస్ సభలో కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ను ఓడించి మళ్ళీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నారు… కానీ ఈ ఐదేళ్లే కాదు ఆ తర్వాత కూడా తానే ముఖ్యమంత్రిగా వుంటానన్నారు. రా బిడ్డా… ఎట్ల అధికారంలోకి వస్తావో చూస్తాను… నీ సంగతేందో చూస్తానంటూ కేసీఆర్ కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ యువత చేతికి పెత్తనం ఇస్తున్నా… ఇకపై ఎట్ల తిరుగుతావో చూస్తానంటూ హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ ను దోచుకున్న కేసీఆర్ ను కొట్టుకుంటూ తీసుకెళ్లి జైల్లో పెడతామని , పోలీస్ ఉద్యోగాలు పొందిన బిడ్డలే కేసీఆర్ మోకాళ్లచిప్పలపై లాఠీలతో కొట్టుకుంటూ తీసుకెళ్ళే రోజు వస్తుందన్నారు. తన కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని బలిచ్చిన కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని… అందువల్లే గత ఎన్నికల్లో ఓడించారని అన్నారు. ఇక ఎప్పుడూ ఆయన అధికారంలోకి రాలేరని… పోలీస్ ఉద్యోగాల్లో చేరుతున్న ఈ పిల్లలే కేసీఆర్ కు గుణపాఠం చెబుతారని రేవంత్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేసామని… చిక్కుముడులను కూడా ఒక్కోటిగా విప్పుతున్నామన్నారు. ఎవరు అడ్డుపడ్డా ఉద్యోగ నియామకాలు కొనసాగుతాయని… నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా వుంటుందన్నారు.

Read Also : Telangana: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మూడు నగరాల పేర్లు మార్పు