Site icon HashtagU Telugu

Revanth Reddy : మామ..అల్లుళ్ల నుండి సిద్దిపేటకు విముక్తి కలిగించాలి

Revanth Siddpet

Revanth Siddpet

లోక్ సభ ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికే సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల నేతలు తమ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. గులాబీ బాస్ కేసీఆర్ (KCR) కు మాత్రం ఈసీ షాక్ ఇచ్చారు. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆదేశాలు జారీ చేయడంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఇటు సీఎం రేవంత్ (CM Revanth) మాత్రం తన ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అటు బిజెపి సర్కార్ ఫై..ఇతి ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ ఫై నిప్పులు చెరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు సిద్ధిపేట (Siddipet) లో మెదక్ అభ్యర్థి నీలం మధు (Neelam Madhu) కు సపోర్ట్ గా ప్రచారం చేసారు. గత 45 ఏళ్లుగా సిద్దిపేటను మామ, అల్లుడు పట్టి పీడిస్తున్నారని అన్నారు. మామా, అల్లుడి నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించడానికి వచ్చామని.. సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరకపోతే శాశ్వతంగా బానిసత్వం వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దొరల గడీలను బద్దల కొట్టకపోతే ఎప్పటికీ అభివృద్ధి జరగదని అన్నారు. మెదక్ నుంచి ఇందిరాగాంధీ ఎంపీగా పోటీ చేసి గెలిచారని , ఇందిరా గాంధీ హయాంలో మెదక్ కు ఎన్నో పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేసారు.

కొమురవెళ్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ చేసి..సిద్దిపేటకు మరోసారి వస్తానని అన్నారు. హరీష్ రావు తన రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. శనీశ్వరరావు నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పిస్తానని అన్నారు. పదేళ్లలో ఢిల్లీ దొర, సిద్దిపేట దొర తెలంగాణ కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. మామ పోతే.. అల్లుడు అన్నట్లుగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నారని తెలిపారు. కలెక్టర్ గా ఉన్నప్పుడు వెంకట్రామిరెడ్డి వందల ఎకరాలు కొల్లగొట్టారని అన్నారు. నిజాం దగ్గర ఖాసీం రిజ్వీ ఎలాగో కేసీఆర్ కు వెంకట్రామిరెడ్డి అలా అని సీఎం రేవంత్ అన్నారు.

Read Also : AP : ఉద్యోగులకు జగన్ భారీ షాక్ ..