Site icon HashtagU Telugu

సీఎం కేసీఆర్ దోచుకున్న ప్రజాధనాన్ని మొత్తం కక్కిస్తా – రేవంత్

Revanth Lb Nagar

Revanth Lb Nagar

తెలంగాణ ఎన్నికల (TS Polls) ప్రచారానికి మరో నాల్గు రోజుల సమయం మాత్రమే ఉండడం తో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేస్తున్నాయి. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..రోజుకు నాల్గు సభలను కవర్ చేస్తూ వస్తుంటే..మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు , కవితలు నియోజకవర్గాలను, రోడ్ షో లు , సమావేశాలు కవర్ చేస్తూ వస్తున్నారు. ఇక బిజెపి , కాంగ్రెస్ పార్టీలు సైతం తమ ప్రచారాన్ని (Election Campaign) గట్టిగానే చేస్తున్నాయి. ఈరోజు నుండి ఈ నాల్గు రోజు జాతీయ నేతలు సైతం ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మోడీ ,అమిత్ షా, నడ్డా తదితరులు బిజెపి ప్రచారంలో పాల్గొనబోతుంటే..రాహుల్ , ప్రియాంక , శివకుమార్ తదితరులు కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొనబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక మరోపక్క టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ (Revanth Reddy) సైతం గత కొద్దీ రోజులుగా అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ కాంగ్రెస్ గ్యారెంటీ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తు..బిఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకలను తెలుపుతూ కాంగ్రెస్ ఛాన్స్ ఇవ్వండని కోరుతున్నారు. హైదరాబాద్ శివారు ఎల్బీనగర్ నియోజకవర్గం, వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ..బిఆర్ఎస్ , బీజేపీ పార్టీల ఫై నిప్పులు చెరిగారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని, ఆ ప్రజాధనాన్ని మొత్తం కక్కిస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు తోడు దొంగలని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు. అలాగే LB నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫై కూడా రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సుధీర్ రెడ్డి కి రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ అని, అటువ పార్టీని, ఆయన నమ్ముకున్న నాయకులను, కార్యకర్తలను నట్టేట ముంచి బీఆర్ఎస్‌లో చేరారని మండిపడ్డారు. సుధీర్ రెడ్డి తన అనుచరులతో నియోజకవర్గం ప్రజలపై భౌతిక దాడులు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు సైతం కబ్జాలు చేసిన ఘనుడు సుధీర్ రెడ్డి అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుధీర్ రెడ్డి కబ్జాల బాగోతాన్ని మొత్తం బయటకు తీస్తామని హెచ్చరించారు.

Read Also : Telangana Elections 2023 : మొత్తం 35,635 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు