Revanth: కేసీఆర్, జియ్య‌ర్ పై రేవంత్ రౌండ‌ప్

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌కటించిన ఇంగ్లీషు మీడియం అంశంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిప‌డ్డాడు. సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలను అన్నింటినీ మూసివేశారని, టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం చదువు ఎలా సాధ్య‌మ‌ని నిల‌దీశాడు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌కటించిన ఇంగ్లీషు మీడియం అంశంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిప‌డ్డాడు.
సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలను అన్నింటినీ మూసివేశారని, టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం చదువు ఎలా సాధ్య‌మ‌ని నిల‌దీశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు టీచర్ల నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే నియమకాలను చేపట్టారని రేవంత్ తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సీఎల్పీలో మీడియా మిత్రులతో జరిపిన చిట్ చాట్ లో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ విషయాలతో పాటు, ఆధ్యాత్మిక విషయాలపై తన ఒపీనియన్ పంచుకున్నాడు. ఆ సంద‌ర్భంగా కేసీఆర్ విధానాల‌పైన‌, బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పై స్పందించాడు. అంతేకాదు, చిన్న‌య్య‌ర్ స్వామిపై సెటైర్లు వేస్తూ శైవులు, వైష్ణ‌వుల వ్య‌త్యాసాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చాడు.
చిట్ చాట్ ప్ర‌ధాన అంశాలివి..
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుందని, యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నామని చెప్తూ కేసీఆర్ ప్రజలని పక్కదారి పట్టిస్తున్నారని రేవంత్ విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ టీచర్ల నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ ప్రశ్నించారు. సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలను అన్నింటినీ మూసివేశారని, టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం ఎలా చదువును అందిస్తారని రేవంత్ సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే నియమకాలను చేపట్టారని రేవంత్ తెలిపారు.

రాష్ట్ర ప్రజల ప్రాణాలంటే కేసీఆర్ కి లెక్క లేదని, అందుకే మోడీ వీడియో కాన్ఫిరెన్సు కు హాజరు కాలేదని రేవంత్ విమర్శించారు. పాఠశాలలో కరోనా మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదని, అయినా వాటిని మూసివేశారని రేవంత్ విమర్శించారు. పబ్ ల వల్ల మరణాలు జరుగుతున్నా వాటిని నియంత్రణ చేయరని, వాటిని ఆదాయవనరుగా చూస్తున్నారని రేవంత్ అన్నారు.
టీఆర్ఎస్ యూపీలో ఎస్పీకి మద్దతుగా ప్రచారం చేస్తే ఎంఐఎంకి మిత్రద్రోహం చేసినట్టేనా అని కేసీఆర్ ని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకొన్న టీఆర్ఎస్ యూపీలో ఎస్పీకి ఏవిధంగా ప్రచారం చేస్తారని రేవంత్ నిలదీసారు.

కేటీఆర్ క్రిమినల్స్ తో చర్చలు జరపకపోవచ్చు కానీ తాను 420, క్రిమినల్స్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని రేవంత్ ప్రకటించారు. కేటీఆర్ చర్చలు జరపాలి అంటే సినిమా గ్లామర్ ఉండాలని అది తన దగ్గర లేదని రేవంత్ సెటైర్స్ వేశారు.

బీజేపీ పక్క పార్టీల నుంచి తీసుకున్న నేతలతో కమిటీలు వేసుకున్నారని, ఆ కమిటీలు చూస్తనే బీజేపీ దివాళ తీసిందని అర్థం అవుతుందని రేవంత్ తెలిపారు. ఆపరేషన్ ఆకర్ష్ కోసం పార్టీ లో కమిటీ వేశారంటేనే, ఆ పార్టీ పని ముగిసిందని అర్ధం చేసుకోవచ్చని రేవంత్ తెలిపారు.

తాము శైవులం కాబట్టే వైష్ణవులు మమ్ములను అవమానిస్తున్నారని రేవంత్ అన్నారు. చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమం నుంచి తమకు ఆహ్వానం ఎందుకు రాలేదని, చిన్నజీయర్ స్వామీజీ పై మాకు అపారమైన గౌరవముందని, అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ను పక్కనపెట్టుకొని తిరిగితే చినజీయర్ పై తమకు అనుమానాలు వస్తాయని రేవంత్ అన్నారు. దేవుని ముందు అందరూ సమానమే అన్న స్వామీజ దగ్గర సమానత కనిపించడం లేదని రేవంత్ విమర్శించారు.

స్వామీజీని తాను కలిసి ఏమైనా చెప్పాలంటే ఆయన చుట్టూ రియలేస్టేట్ వ్యక్తులే ఉంటారని, చిన్నజీయర్ స్వామి దగ్గర రియలేస్టేట్ వ్యక్తులు ఉంటే ఆయన గౌరవానికి కరెక్ట్ కాదని రేవంత్ తెలిపారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటన అడ్డం పెట్టుకోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆస్తులను పెంచడానికి ప్రభుత్వం పనిచేస్తోందని, రియల్ ఎస్టేట్ సంస్థ కోసం చెట్లను నరకడం పై బీజేపీ సమాధానము చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.