Revanth Reddy Delhi Tour : నెలకు ఐదుసార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లాల్సిందేనా..?

తెలంగాణ సీఎం గా భాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..వరుసగా ఢిల్లీ (Delhi)కి వెళ్లివస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ఐదు సార్లు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ..ఎన్నికల ప్రచారం లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..ఏంచేయాలన్న..ఏ నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ కి వెళ్లి అక్కడి పెద్దలను అడిగి చేయాలనీ..సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేరని..పేరుకు మాత్రమే ఇక్కడ ప్రభుత్వం..జరిగేదంతా ఢిల్లీ పెద్దల పాలనే […]

Published By: HashtagU Telugu Desk
CM Revanth Reddy

CM Revanth Reddy

తెలంగాణ సీఎం గా భాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..వరుసగా ఢిల్లీ (Delhi)కి వెళ్లివస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ఐదు సార్లు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ..ఎన్నికల ప్రచారం లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..ఏంచేయాలన్న..ఏ నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ కి వెళ్లి అక్కడి పెద్దలను అడిగి చేయాలనీ..సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేరని..పేరుకు మాత్రమే ఇక్కడ ప్రభుత్వం..జరిగేదంతా ఢిల్లీ పెద్దల పాలనే అని కేసీఆర్ పదే పదే చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ తీరు చూస్తున్న వారంతా ఇది ఇలా జరుగుతుందని కేసీఆర్ అప్పడే చెప్పాడని గుర్తు చేసుకుంటున్నారు.

గడిచిన నెలరోజుల్లో సీఎం రేవంత్ మొత్తం ఐదుసార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారు. సగటున వారానికి ఒక్కసారైనా ఢిల్లీ వెళ్లకుండా ఉండలేకపోయారు. తాజాగా, తన రెండురోజుల పర్యటన ముగించుకొని శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకొన్నారు. నెల రోజుల్లో రేవంత్ ఢిల్లీ టూర్స్ చూస్తే..

We’re now on WhatsApp. Click to Join.

డిసెంబర్‌ 6: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు.. ఇందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లివచ్చారు.

డిసెంబర్‌ 8: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ పార్టీ అధిష్ఠానంతో పార్టీ పదవులపై చర్చించారు.

డిసెంబర్‌ 19: పార్టీ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్‌ తదితరులతో సమావేశమయ్యారు. శంషాబాద్‌ నుంచి సాధారణ ప్రయాణికుల విమానంలో వెళ్లిన ఆయన పార్టీ పీఏసీ తీసుకొన్న నిర్ణయాలపై చర్చించారు. పలువురు సహచర ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. 20 తేదీన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

డిసెంబర్‌ 26: పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. సీఎంతోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు కూడా వెళ్లారు. 27వ తేదీన తిరిగి వచ్చారు.

జనవరి 4: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ అక్కడ పలువురు కేంద్ర మంత్రులు, పార్టీకి సంబంధించిన ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఇలా వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక విమానంలో వెళ్తూ ప్రజల డబ్బుతో ప్రయాణం చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నెలకే 05 సార్లు వెళ్తే..ఐదేళ్లలో ఎన్నిసార్లు వెళ్ళాలి..ఎంత ఖర్చు కావాలి..అని మాట్లాడుకుంటున్నారు.

Read Also : Sankranti Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఏపీఎస్‌ఆర్టీసీ 6,795.. టీఎస్ఆర్టీసీ 4,484

  Last Updated: 06 Jan 2024, 11:54 AM IST