Site icon HashtagU Telugu

Telangana Assembly Session: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు

Telangana Assembly Session

Telangana Assembly Session

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హరీశ్ రావు ప్రసంగాన్ని మంత్రులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నన్ను కాదని సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ద్వారా తీసుకున్న రుణాలను మిగిలిన ప్రాజెక్టులకు వాడుకున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బాగా పాలించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేసి పేరు తెచ్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ అంటున్న శ్వేతపత్రాలు రాష్ట్ర ప్రగతికి కత్తెర పత్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి

హరీశ్‌రావు అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సభను తప్పుదోవ పట్టించే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరుతున్నట్లు తెలిపారు.కాళేశ్వరం నీళ్లతో వ్యాపారం చేస్తామని చెప్పి అప్పులు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం నీళ్లతో ఏటా రూ.5 వేల కోట్లు ఆర్జిస్తామని చెప్పారని గుర్తు చేశారు. మిషన్ భగీరథతో 5,700 కోట్లు. బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చి రుణాలు పొందారన్నారు. కాళేశ్వరం, భగీరథతో ఏటా రూ.10 వేల కోట్లు ప్రజల నుంచి వసూళ్లు చేస్తామని నివేదిక ఇచ్చామన్నారు. తప్పుడు మార్గాల్లో రుణాలు తెస్తున్నారని కాగ్ తప్పుబట్టిందన్నారు. రూ.80 వేల కోట్లతో కాళేశ్వరం నిర్మాణం అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ రుణం రూ.97,448 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రభుత్వం చేసిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని తెలిపారు.

మంచినీటి కోసం ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదని హరీశ్ రావు అన్నారు. రుణాలను ఎలా వినియోగించుకున్నారన్నది ముఖ్యమన్నారు. అప్పులు తెచ్చి రాష్ట్రంలో ఆస్తులు సృష్టించారని పేర్కొన్నారు. తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్తు అవసరాల కోసం ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రుణాలు తెచ్చామన్నారు. కాగా అసెంబ్లీలో మోటార్లకు మీటర్ల విషయంలో ఉత్తమ్, హరీశ్ రావుల మధ్య వాగ్వాదం జరిగింది. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పిందన్న హరీశ్ రావు వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మీటర్లు బిగించమని కేంద్రం చెప్పిందా లేదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. కరెంటు బిల్లులు చెల్లించాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని ఉత్తమ్ బదులిచ్చారు.

Also Read: Hero EV Offer: ఈవీ స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా అన్ని రూ.వేల తగ్గింపుతో?