Site icon HashtagU Telugu

Revanth Reddy Contest Against KCR : కేసీఆర్ ఫై రేవంత్ పోటీ..?

Kcr Revanth

Kcr Revanth

ఈసారి తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) పోరు మాములుగా ఉండడం లేదు..అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు పక్క ప్రణాళికలు చేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బిఆర్ఎస్ చూస్తుంటే..ఆ ఛాన్స్ ఇచ్చేదేలే అంటున్నాయి. అంతే కాదు కేసీఆర్ ను సైతం ఓడిస్తాం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ (KCR) ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గజ్వేల్ తో పాటు కామారెడ్డి (Kamareddy) స్థానాలనుండి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రెండు స్థానాల నుండి నేను రెడీ అంటూ ఇప్పటికే బిజెపి నేత ఈటెల ప్రకటించగా..ఇక ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సైతం సై అనేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

కొడంగల్ తో పాటుగా కామారెడ్డి నుంచి రేవంత్ (Revanth) బరిలోకి దిగనున్నట్లు సమాచారం అందుతుంది. కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో కామారెడ్డి నుంచి షబ్బీర్ పేరు లేకపోవటం చర్చకు కారణమైంది. సీనియర్లకు దాదాపు తొలి జాబితాలోనే టికెట్ ఖరారు చేసిన కాంగ్రెస్.. షబ్బీర్ పేరు మాత్రం ప్రకటించలేదు. కామారెడ్డి తొలి నుంచి కాంగ్రెస్ కు అనుకూల నియోజకవర్గంగా ఉంది. షబ్బీర్ అలీ ఇక్కడి నుంచి రెండు సార్లు గెలిచి మంత్రి అయ్యారు. బీఆర్ఎస్ నుంచి గంపా గోవర్ధన్ మూడు సార్లు బీఆర్ఎస్, ఒక సారి టీడీపీ నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ఇక్కడ నుంచి షబ్బీర్ 5,007 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో, ఈ సారి గెలుపు కోసం షబ్బీర్ చాలా రోజులుగా నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ కామారెడ్డి బరిలో నిలువడం తో షబ్బీర్ ఇంట్రస్ట్ చూపించడం లేదు. దీంతో ఆ స్థానంలో రేవంత్ బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం చూస్తున్నట్లు సమాచారం. రేవంత్ సైతం కేసీఆర్ సై అంటున్నాడట. అలాగే బిజెపి నుండి విజయశాంతి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

దీంతో, ఇప్పుడు గజ్వేల్..కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా మారుతోంది. కొడంగల్ లో రేవంత్ ను ఓడించేలా ఇప్పటికే బీఆర్ఎస్ వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఈ సమయంలోనే కామారెడ్డి నుంచి రేవంత్ బరిలోకి దిగటం ద్వారా పార్టీలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

Read Also : Congress : కాంగ్రెస్, సపా మధ్య వివాదం.. విపక్షాల ఐక్యతకు ప్రమాదం