తెలంగాణ ఎన్నికల ఫలితాల ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియా తో సమావేశం ఏర్పాటు చేసారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి అమరుడయ్యారని చెప్పారు. ‘ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగింది. జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తి నింపారు. నేను, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిసి పార్టీని ముందుకు నడిపించాం. పౌరుల హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది.’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ నాయకులందరి సహకారంతో హస్తం పార్టీ విజయం సాధించిందని అన్నారు.
ఇక ఫై ప్రగతి భవన్ కాదు ..Dr BR అంబేద్కర్ ప్రజా భవన్..ఈ ప్రజా భవన్ లోకి ప్రజలంతా రావొచ్చని రేవంత్ అన్నారు. సీనియర్ నాయకుల సహకారం తో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. సిపిఐ, సిపిఎం , టీజేఎస్ పార్టీ లతో కలిసి ముందుకు వెళ్తాము. పార్టీ అంతర్గత విషయాల్లో సహకరించిన ఖర్గే కి ధన్యవాదాలు. మా వెనుకాల 30 లక్షల మంది నిరుద్యోగులు అండగా నిలిచారు. సామాన్యుల కోసం సచివాలయ గేట్లు తెరిచి ఉంచుతామని చెప్పారు. ప్రతిపక్షాలలో ఎవరు ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ విజయం తెలంగాణ అమరులకు అంకితం.
Read Also : Telangana Elections Results : కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన ఓటర్లు