CM Revanth Reddy : సీఐఐ సమావేశంలో కేసీఆర్ ఫై రేవంత్ ప్రశంసలు

మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశంసలు కురిపించారు. మంచి చేస్తే మంచి అని , చెడు చేస్తే చెడు అని చెప్పేవారే నిజమైన రాజకీయనేతలు..అధికారం చేతిలో ఉందికదా అని గతాన్ని మరచిపోవద్దు..గత ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ..వారు చేసిన అభివృద్ధి నుండి తాము ఇంకా ఎంత బాగా చేయగలమో తెలుసుకోవాలి..అప్పుడే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది..రాష్ట్రం కూడా అభివృద్ధి […]

Published By: HashtagU Telugu Desk
Revnth Kcr

Revnth Kcr

మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫై మరోసారి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశంసలు కురిపించారు. మంచి చేస్తే మంచి అని , చెడు చేస్తే చెడు అని చెప్పేవారే నిజమైన రాజకీయనేతలు..అధికారం చేతిలో ఉందికదా అని గతాన్ని మరచిపోవద్దు..గత ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ..వారు చేసిన అభివృద్ధి నుండి తాము ఇంకా ఎంత బాగా చేయగలమో తెలుసుకోవాలి..అప్పుడే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది..రాష్ట్రం కూడా అభివృద్ధి జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే చేస్తున్నారు.

గత ప్రభుత్వ లోపాలు , అవకతవకల గురించి ప్రస్తావిస్తూనే..చేసిన మంచి గురించి వివరిస్తూ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సీఐఐ (CII) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని గత ముఖ్యమంత్రులు చంద్రబాబు (CBN) , వైస్సార్ (YSR) , కేసీఆర్ (KCR) లు హైదరాబాద్ (HYD) ను ఎంత బాగా డెవలప్ చేసారో తెలియజేస్తూ వారిపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలన్నదే తమ లక్ష్యమని , ఇతర రాష్ట్రాలతో పోటీనే లేదని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, వ్యాపారవేత్తలకు కొత్త ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెట్టుబడులకు రక్షణ కల్పిస్తుందన్నారు. ఈ ప్రభుత్వం అందరిదని… ప్రజలందరూ కోరుకుంటేనే తాము వచ్చామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధిని కొనసాగించారు. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి విభేదాలు లేవు. మహానగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను అలానే కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐ తో కలిసి ముందుకు నడుస్తామని, 64 ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లతో డెవలప్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే.. స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్‌లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నాట్లు ప్రకటించారు. దీంతో పాటుగా.. తెలంగాణలో డ్రైపోర్టును ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారు. ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్‌గా మారిందని..సీఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చెప్పుకొచ్చారు.

Read Also : Kamal Haasan : ఇండియా కూటమిలో చేరికపై స్పందించిన కమల్ హాసన్

  Last Updated: 21 Feb 2024, 03:08 PM IST