Site icon HashtagU Telugu

Revanth Reddy : తెలంగాణ అంటేనే త్యాగాలు – రేవంత్ రెడ్డి

Revanth Reddy Promotion

Revanth Reddy fires on Name Changing India to Bharat

తెలంగాణ ఎన్నికల (Telangana Assembly Elections) సమయం మరింత దగ్గరకు వచ్చింది.. నేటి నుండి నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. దీంతో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారంతో పాటు అధికార పార్టీ ఫై విమర్శనాస్త్రాలు మరింత పదును చేస్తున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ (BRS) – కాంగ్రెస్ (Congress) మధ్య పెద్ద వార్ నడుస్తుంది. ఇప్పటికే ఇరువురు విమర్శలు , ప్రతివిమర్శలు , కౌంటర్లు వేసుకుంటూ ఎన్నికల వేడి పెంచేస్తున్నారు.

తాజాగా ఈరోజు మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)మాట్లాడుతూ..కేసీఆర్ ఫై బిఆర్ఎస్ ఫై నిప్పులు చెరిగారు. తెలంగాణ అంటేనే త్యాగాలు అని అన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నం త్యాగాల ప్రతీకగా ఉండాలన్నారు. కానీ కేసీఆర్ (KCR) సర్కార్ రూపొందించిన అధికారిక చిహ్నం రాచరిక పోకడలను ప్రతిబింబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 90 శాతం ప్రజల ప్రతీకగా తెలంగాణ తల్లి ఉండాలన్నారు. కానీ కేసీఆర్ రూపొందించిన తెలంగాణ తల్లి అందుకు భిన్నంగా ఉందని సంచలన వాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని కేసీఆర్ హరించారని మండిపడ్డారు. ప్రజల హక్కులను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడిందన్నారు. 10 మంది కేసీఆర్ లు మరణించినా తెలంగాణ వచ్చేది కాదని.. సోనియా గాంధీ వల్లే రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను కాంగ్రెస్సే మొదలుపెట్టిందని రేవంత్ అన్నారు. ఉచిత విద్యుత్ నుంచి పెన్షన్ల వరకు అన్ని పథకాలను ప్రారంభించిందన్నారు. కేసీఆర్ ఏం చేశారో చెప్పుకునే పరిస్థితుల్లో లేరన్నారు. అందుకే కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలనే కేసీఆర్ కాపీ కొట్టారని ఆరోపించారు. రైతులకు 10 వేలు సాయం చేస్తామని 2014లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టామన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనపై చర్చ రెడీ అని సవాల్ చేశారు. కాంగ్రెస్ ఏం చేయగలుగుతుందో కూడా చెబుతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ఎప్పుడూ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడలేదన్నారు. మైనారిటీలను అన్ని రకాలుగా సంక్షేమంలో భాగస్వాములను చేస్తామని చెప్పుకొచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. పేదలకు విద్యను చేరువ చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన స్కూళ్లలో 6,540 సింగిల్ టీచర్ స్కూళ్లను కేసీఆర్ హయాంలో మూసేశారన్నారు. తెలంగాణను మెగా మాస్టర్ ప్లాన్ తో డెవలప్ మెంట్ చేస్తామన్నారు. అసైన్ మెంట్ భూములకు పట్టాలు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే కబ్జాదారులు ఆరోపించారు. ధరణి పోర్టల్ తో రైతులకు అన్నిదారులు మూసివేశారని రేవంత్ ఫైర్ అయ్యారు. ధరణిలో సమస్యలు ఉంటే చెప్పుకునే పరిస్థతి లేదన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిలో సంపూర్ణ మార్పులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

Read Also : KCR : కామారెడ్డిలో పౌల్ట్రీ రైతుల నుండి కేసీఆర్ కు పెద్ద చిక్కొచ్చి పడింది