Revanth Reddy : తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి..ఎల్లుండి ప్రమాణ స్వీకారం

తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ప్రకటించారు కేసీ వేణుగోపాల్

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 06:51 PM IST

కాంగ్రెస్ శ్రేణుల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని ప్రకటించారు కేసీ వేణుగోపాల్ (KC Venugopal). ఎల్లుండి (డిసెంబర్ 07) ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే సీనియర్లందరికి న్యాయం చేస్తామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కాంగ్రెస్ ను విజేతగా తేల్చేసారు. కానీ సీఎం ఎవరనేది మాత్రం రెండు రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం తేల్చకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొని ఉండే…సీఎం రేస్ లో భట్టి , ఉత్తమ్ లతో పలువురు పోటీ పడడం తో ఫైనల్ గా అధిష్టానం ఎవర్ని సీఎం గా ప్రకటిస్తుందో అని అంత ఎదురుచూసారు.

కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదివారం నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తూ వచ్చింది. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో కాంగ్రెస్‌ కీలక నేతలు మంగళవారం సమావేశమయ్యారు. సీఎం పదవి కోసం పోటీ పడుతున్న ఉత్తమ్ (Uttam) , భట్టి (Bhatti) లతో విడివిడిగా చర్చలు జరిపారు. ఈ సమావేశానికి పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ, జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించిన డీకే శివకుమార్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్‌రావు థాక్రే పాల్గొన్నారు. ఫైనల్ గా రేవంత్ ను సీఎం గా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి హోటల్ ఎల్లా నుంచి హుటాహుటిన ఢిల్లీకి పయణమయ్యారు. అయన ఢిల్లీ కి వెళ్లేలోపే రేవంత్ ను సీఎం గా అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు. ఇక ఢిల్లీ లో రేవంత్..తన ప్రమాణ స్వీకారానికి సోనియా , రాహుల్ , ప్రియాంక లను ఆహ్వానించబోతున్నారు.