Mynampally Tickets Issue: మైనంపల్లి ఫ్యామిలీకి రెండు టికెట్లు : రేవంత్ రెడ్డి

గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి నియోజకవర్గంపై అందరి చూపు పడింది. ఈ నియోజవర్గ ఆస్థాన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే.

Mynampally Tickets Issue: గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి నియోజకవర్గంపై అందరి చూపు పడింది. ఈ నియోజవర్గ ఆస్థాన ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. తన కుమారుడికి టికెట్ కేటాయించకపోవడంతో మైనంపల్లి అధికార పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. పార్టీ కొందరి చేతుల్లో కీలుబొమ్మగా మారిందంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. మొత్తంగా మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్దమయ్యాడు.

మైనంపల్లి హనుమంతరావు కుటుంబానికి రెండు టికెట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మైనంపల్లి సెప్టెంబర్ 28న సాయంత్రం కాంగ్రెస్ లో చేరుతారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. కేటీఆర్ కి చట్టం పట్ల అవగాహన లేదన్నారు. ఆయనకు బుర్ర తక్కువ ఆకలి ఎక్కువని ఎద్దేవా చేశారు. గవర్నర్ కోటలో ఎవరిని నామినేట్ చేయాలనే విషయం కేటీఆర్ కి తెలియదని , తెలంగాణ ప్రభుత్వానికి సెన్స్ లేదన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఎంపికలో గెలుపును ప్రాధాన్యత అంశంగా తీసుకుంటున్నామని రేవంత్ చెప్పారు.

Also Read: 2018 Movie : ఇండియా నుంచి అధికారిక ఆస్కార్ ఎంట్రీ సాధించిన మలయాళీ సూపర్ హిట్ సినిమా..