Site icon HashtagU Telugu

Revanth Reddy : ధరణి ని తీసివేస్తాం అని మీము చెప్పలేదు – రేవంత్ రెడ్డి

Revanth Dharani

Revanth Dharani

ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ (BRS) కాంగ్రెస్ (Congress) ఫై పలు విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి (Dharani) ని తీసేస్తారని..ఈ మాట వారే చెపుతున్నారని సీఎం కేసీఆర్ (CM KCR) దగ్గరి నుండి నేతలంతా చెప్పుకుంటూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. బిఆర్ఎస్ నేతల కామెంట్స్ విని రైతులు నిజంగానే కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తారా..? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ (Revanth) క్లారిటీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌(Alampur)లో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ధరణి(Dharani) పోర్టల్‌ కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ ను రద్దు చేసి దాని స్థానంలో కొత్త యాప్ ను ప్రవేశపెడుతామని అన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి 24గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్.. అది నిజమని నిరూపిస్తే తాను నామినేషన్‌ వేయనని సవాల్‌ విసిరారు. లేకపోతే మీరు గద్వాల చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి, బకాయిలు తొలగించి, కేసులు ఎత్తివేశామన్నారు. 18లక్షల పంపుసెట్లకు ఉచిత కరెంటు అందించామన్నారు. నిజంగా కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఉంటే.. తెలంగాణలో పంపుసెట్లు 18 లక్షల నుంచి 25 లక్షలకు ఎలా పెరిగాయని ప్రశ్నించారు.

కాంగ్రెస్ గెలిస్తేనే బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం సాధ్యమవుతుంది. కాంగ్రెస్ వస్తుంది.. ఆరు గ్యారంటీలను ఆమలు చేసి తీరుతుంది.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ మహిళకు చేయూతను అందిస్తాం. కేసీఆర్ ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్ అని ప్రజలు అంటున్నారు. అందుకే ధరణి, 24గంటల కరెంటు విషయంలో కాంగ్రెస్‌పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ధరణి కంటే మెరుగైన సాంకేతికత తీసుకొచ్చి రైతుల భూములను కాపాడుతాం. రైతులకు, కౌలు రైతులకు ఏటా రూ.15వేలు,రైతు కూలీలకు రూ.12వేలు అందిస్తా. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు… ప్రతీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తాం. ఎవరూ బిల్లులు కట్టకండి.. వచ్చే నెల కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది.” అని రేవంత్‌ పేర్కొన్నారు.

Read Also : TS Polls 2023 : జగిత్యాల అసెంబ్లీ బరిలో 82 ఏళ్ల వృద్ధురాలు పోటీ