Telangana Police: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసు అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్, జడ్చర్ల పోలీసులు, నాగర్‌కర్నూల్‌లో కేసులు నమోదు చేశారు.భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 153, 504, 505 (2), 506 నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గుణవర్ధన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కి ఫిర్యాదు చేశారు. పోలీస్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‌లపై నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఇంతకీ రేవంత్ రెడ్డి చేసిన తప్పేంటంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో పోలీసుల అంతు చూస్తామని, డైరీలో కొందరు పోలీసు అధికారుల పేర్లు రాశారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. గాంధీభవన్‌లో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొందరు నేతలను పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసుల రేవంత్ పై యాక్షన్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని సంఘం అధ్యక్షుడు రామచంద్రగౌడ్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీలకు అతీతంగా పోలీసు అధికారులు చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు.
Also Read: Carrot Sweet Corn Omelette: ఎప్పుడైన క్యారెట్ స్వీట్ కార్న్ ఆమ్లెట్ తిన్నారా.. అయితే ట్రై చేయండిలా?