Revanth Reddy Anu Nenu : రేవంత్ రెడ్డి అను నేను..

తెలంగాణ రాష్ట్ర సీఎం గా నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను

Published By: HashtagU Telugu Desk
Revanth Reddy Anu Nenu

Revanth Reddy Anu Nenu

అనుముల రేవంత్ రెడ్డి అను నేను (Revanth Reddy Anu Nenu)… తెలంగాణ రాష్ట్ర సీఎం (Telangana CM) గా నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఎల్లుండి ఈ మాట యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినబోతున్నారు. రాజకీయాల్లో కేవలం 20 ఏళ్ల అనుభవం ఉన్న రేవంత్..ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్ని పాలించబోతున్నాడు. 1969, నవంబరు 8న తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, కొండారెడ్డిపల్లి గ్రామం లో రేవంత్ జన్మించాడు. చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఆసక్తి అనేది ఎక్కువగా ఉండేది. రేవంత్ రెడ్డి.. గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడే ABVP లీడర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఉస్మానియా వర్సిటీ ఏవీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను 1992లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

రేవంత్ రాజకీయ ప్రస్థానం :-

2004లో టీడీపీ పార్టీలో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగారు. 2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మిడ్జిల్ స్థానం నుంచి పోటీ చేయడానికి టీడీపీ నామినేషన్ తిరస్కరించడంతో.. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. 2008లో శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. 2008లో మళ్ళీ టీడీపీలో చేరిన రేవంత్.. 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2014లోనూ అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై రెండోసారి గెలిచారు. టీడీపీ CLP నేతగా కూడా వ్యవహరించారు.

2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయించేందుకు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయ్యి..సంచనలం రేపారు. 2017లో టీడీపీలో నేతలతో విభేదాలతో ఆ పార్టీని వీడి రెండు నెలల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2018లో మొదట కాంగ్రెస్ పార్టీలోని ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్ లో ఒకరిగా నియమితులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ పై కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా AICC నియమించింది. సీనియర్లు, జూనియర్లను కలుపుకుపోయి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు.

We’re now on WhatsApp. Click to Join.

అభ్యర్థుల ప్రకటన నుండి అన్ని తానై చూసుకున్నాడు. రాష్ట్రం మొత్తం పర్యటించి…బిఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ..కాంగ్రెస్ మేనిఫెస్టో ను ప్రజలకు తెలియజేస్తూ..ప్రత్యర్థి పార్టీల ఫై విరుచుకుపడుతూ.. తనదైన మాటలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ రెండో సీఎం గా తన బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు. రేవంత్ రెడ్డి ని సీఎం గా అధిష్టానం ప్రకటించడం తో రాష్ట్రం మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కలుస్తూ దీపావళిని తలపిస్తున్నారు. డిసెంబర్ 07 న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 09 న LB స్టేడియం లో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి..మిగతా నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

Read Also : Revanth Reddy : తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి..ఎల్లుండి ప్రమాణ స్వీకారం

  Last Updated: 05 Dec 2023, 11:15 PM IST