Site icon HashtagU Telugu

Revanth Reddy CM : రేవంత్ రెడ్డి ని సీఎం గా తేల్చేసిన రాహుల్ ..!

Revanth Cm Rahul

Revanth Cm Rahul

కాంగ్రెస్ శ్రేణుల ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తుంది. తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నే అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. మరికాసేపట్లో అధికారికంగా ఈ ప్రకటన రానుందని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కాంగ్రెస్ ను విజేతగా తేల్చేసారు. కానీ సీఎం ఎవరనేది మాత్రం రెండు రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం తేల్చలేకపోయింది. దీంతో బిఆర్ఎస్ తో పాటు సోషల్ మీడియా లో విమర్శలు , ఆరోపణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అధిష్టానం దీనిపై త్వరగా ప్రకటన చేయాలనీ ఫిక్స్ అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం పదవి కోసం ఎక్కువ మంది ఆశిస్తుండటంతో కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆదివారం నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తూ వచ్చింది. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో కాంగ్రెస్‌ కీలక నేతలు మంగళవారం సమావేశమయ్యారు. సీఎం పదవి కోసం పోటీ పడుతున్న ఉత్తమ్ (Uttam) , భట్టి (Bhatti) లతో విడివిడిగా చర్చలు జరిపారు. ఈ సమావేశానికి పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ, జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించిన డీకే శివకుమార్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మానిక్‌రావు థాక్రే పాల్గొన్నారు.

ఈ సమావేశంలో రాహుల్ గాంధీ..రేవంత్ రెడ్డి నే సీఎం అని తేల్చి చెప్పారట. ఇక సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడిన డీకే శివకుమార్ ఒప్పించారని తెలుస్తోంది. కాసేపట్లో సీఎల్పీ భేటీలో అధికారికంగా సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటిస్తారని అంటున్నారు.

Read Also : Chandrababu : ఈ నెల 07 న ఢిల్లీకి బాబు..