TS Cong on Agnipath: రాకేశ్ అంతిమ‌యాత్ర ఉద్రిక్తం, రేవంత్ అరెస్ట్‌

పోలీసు కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ అంతిమ యాత్ర ఉద్రిక్తంగా మారింది. అంతిమ యాత్ర‌లో పాల్గొనేందుకు వెళుతోన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఘ‌ట్ కేస‌రి వ‌ద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Written By:
  • Updated On - June 18, 2022 / 02:35 PM IST

పోలీసు కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ అంతిమ యాత్ర ఉద్రిక్తంగా మారింది. అంతిమ యాత్ర‌లో పాల్గొనేందుకు వెళుతోన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఘ‌ట్ కేస‌రి వ‌ద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతిమ యాత్ర వరంగ‌ల్ ఎంజీఎం నుంచి ప్రారంభ‌మై వ‌రంగ‌ల్ రైల్వే స్టేష‌న్ మీదుగా వెళ్లిన‌ప్పుడు ఆందోళ‌న‌కారులు దాడికి ప్ర‌య‌త్నం చేశారు.

స్టేషన్ దగ్గర పెద్ద సంఖ్యలో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆందోళ‌న‌కారులు పోలీసులకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. అంతకుముందు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. కార్యాలయం బోర్డుకు నిప్పు పెట్టారు. వరంగల్ ఎంజీఎమ్ ఆసుపత్రి నుంచి మొదలైన రాకేశ్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాకేశ్ స్వస్థలమైన దబీర్‌పేట వరకు యాత్ర జ‌రిగింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లలో చనిపోయిన వరంగల్ కు చెందిన ఆర్మీ ఉగ్యోగ అభ్యర్థి రాకేశ్ అంతిమ యాత్రలో పాల్గొని వాళ్లను పరామర్శించేందుకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న రేవంత్ కాన్వాయ్ ని ఘట్ కేసర్ టోల్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా వరంగల్ వెళ్లేందుకు అనుమతించడం లేదని చెప్పారు. అనంతరం రేవంత్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ఘట్ కేసర్ లో నిరసన చేపట్టారు.