Revanth Reddy Arrest : రేవంత్ రెడ్డి అరెస్ట్..హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

రెండు రోజుల క్రితం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాలు చేశారు. రాష్ట్రంలో డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమా..?

Published By: HashtagU Telugu Desk
Revanth Reddy Arrest

Revanth Reddy Arrest

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy Arrest) ని పోలీసులు అరెస్ట్ చేసారు. రెండు రోజుల క్రితం కేసీఆర్‌ (KCR)కు రేవంత్ రెడ్డి సవాలు (Saval) చేశారు. రాష్ట్రంలో డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమా..? సిద్ధమైతే అమరవీరుల స్థూపం (Gun Park) వద్ద ప్రమాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఈరోజు రేవంత్ రెడ్డి తన అనుచరులతో పెద్ద ఎత్తున అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరగా..పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇలాంటివి చేయకూడదు అంటూ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. .

Read Also : MLC Kavitha: రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది: ఎమ్మెల్సీ కవిత

  Last Updated: 17 Oct 2023, 01:45 PM IST