Site icon HashtagU Telugu

CM Revanth Reddy: సీబీఐ విచారిస్తే కేసీఆర్ సేఫ్: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: భాజపా అజ్ఞాతం నుంచి బయటపడాలని, మేడిగడ్డపై తన వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడిగడ్డ విచారణను సీబీఐకి అప్పగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసిందన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, బీజేపీ మార్గదర్శకత్వంలో సీబీఐ పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. కాబట్టి మేడిగడ్డపైసీబీఐ విచారణకు ఆదేశిస్తే బీఆర్‌ఎస్‌కు మంచి జరుగుతుందని చెప్పారు. మేడిగడ్డపై వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే విచారణ నీరుగారిపోతుందని అన్నారు సీఎం రేవంత్.

బ్యారేజీ పిల్లర్ల కుంగిపోయినందుకు బీఆర్‌ఎస్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన బీజేపీ అకస్మాత్తుగా తన వైఖరి మార్చుకుంది. మేడిగడ్డ పర్యటనకు ఎందుకు దూరంగా ఉన్నారో కిషన్‌రెడ్డి వివరించాలి అని సీఎం సూటిగా ప్రశ్నించారు.కేసీఆర్ సానుభూతి కోసం వ్యవహరిస్తున్నారు. చర్చల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి హాజరు కావాలని అభ్యర్థించాం. కానీ వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఛలో నల్గొండకు హాజరు కావడానికే మొగ్గుచూపారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీఎం రేవంత్ రెడ్డి.

కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది మంది పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృథా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరగా , తెలంగాణ రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన ఎల్‌అండ్‌టి నుండి రికవరీ గురించి నేరుగా ప్రస్తావించలేదు. కానీ కంపెనీ తన బాధ్యతను నిర్వర్తించాలని సీఎం రేవంత్ అన్నారు.

Also Read: TSRTC Joint Director: TSRTC జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అపూర్వ రావు