Revanth and Jagga Reddy: మేం తోటి కోడళ్ల లాంటివాళ్లం!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్

  • Written By:
  • Updated On - December 3, 2022 / 02:56 PM IST

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య రాజకీయ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. పార్టీ వ్యవహారాల్లో తగ్గేదే లే అంటూ ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న ఘటనలున్నాయి. రేవంత్ పై నిత్యం నిప్పులు చెరిగే జగ్గారెడ్డి, కాంగ్రెస్ చీఫ్ తో సరాదాగా గడిపి ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాజాగా ఈ ఇద్దరూ హైదరాబాద్ గాంధీ భవన్ లో సరాదాగా మట్లాడుకోవడం తో  కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి తన ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, పార్టీ వ్యవహారాల్లో తనను వ్యతిరేకిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసే జగ్గారెడ్డి రేవంత్ తో అప్యాయతంగా మాట్లాడటం మరింత ఆసక్తిని రేపుతోంది.

తమను తాము ‘తోటి-కోడలు’గా అభివర్ణించుకున్నారు. “ఒక కుటుంబం సభ్యులుగా ఉన్నప్పటికీ, కోడళ్లు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం సర్వసాధారణం. మేం కొన్ని విషయాల్లో విబేధించినప్పటికీ, మరికొన్ని విషయాల్లో పరస్పర అంగీకారంతో ముందుకు సాగుతామని ఇద్దరూ రియాక్ట్ అయ్యారు. నిన్న రేవంత్, జగ్గారెడ్డి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

టీపీసీసీ చీఫ్‌ పదవి గురించి జగ్గారెడ్డి ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో  టీపీసీసీ చీఫ్‌ అత్యున్నత పదవి అని, రేవంత్‌రెడ్డి తన పాదయాత్రను  ఎప్పుడు చేపట్టినా మద్దతిస్తానని జగ్గారెడ్డి అన్నారు. నేను నా సమయం కోసం వేచి ఉంటానన్న జగ్గారెడ్డి.. రేవంత్ రెడ్డి తర్వాత  కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టబోయేది తానేనని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతూ,  తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇతరులకు భిన్నంగా మా మనస్సులో ఉన్నదంతా బహిరంగంగా మాట్లాడుతాం అంటూ మీడియా ముందు ఈ ఇద్దరు వెల్లడించారు. మా మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, మీడియానే దూరం పెట్టాలని చూస్తోందని సరాదాగా పంచులు వేశారు జగ్గారెడ్డి.

సీఎల్పీ కార్యాలయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గతంలోనూ.. గాంధీ భవన్‌లో జరిగిన సమావేశం సందర్భంగానూ ఇద్దరు నేతలు ఎదురెదురుపడి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ సందర్భంలో.. జగ్గారెడ్డి మీసాలు తిప్పుతూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ఫొటోలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. నేతలు, మీడియా ముందు.. ఇలా ఆప్యాయంగా పలకరించుకున్నా.. మళ్లీ రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఆరోపణలు, విమర్శలు చేయటం సాధారణంగా మారిపోయిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.