Site icon HashtagU Telugu

CM Revanth Reddy: 48 గంటలుగా ఎల్లా హోటల్ లోనే రేవంత్ .. భారీ భద్రత పెంపు

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై 48 గంటలు దాటిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన లేదు. దీంతో సీఎం పోస్ట్ కోసం సీనియర్లు లాబీయింగ్ చేస్తున్నారు. నిన్నటి నుంచి ఇక్కడ గాంధీ భవన్‌లో, అక్కడ ఢిల్లీలో సీఎం అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు జరగుతోంది. కాగా ఈ రోజు తెలంగాణ సీఎం ఎంపిక‌పై ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే నివాసంలో సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది.ఈ స‌మావేశంలో కాంగ్రెస్ సీనియ‌ర్లు కేసీ వేణుగోపాల్, డీకే శివ‌కుమార్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చర్చించి.. రేవంత్ రెడ్డికి సీఎం బాధ్యతలను అప్పజెప్పాలని నిర్ణయించారు. డీకే శివకుమార్ ఈ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. సీఎల్పీ సమావేశంలో డీకే శివకుమార్ సీఎం పేరును ప్రకటించనున్నారు. సాయంత్రంలోపు ఏ క్షణంలోనైనా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించే ఛాన్స్ ఉంది. రేవంత్ రెడ్డి డిసెంబరు 7న ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా ఫలితాల వెల్లడి తరువాత నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఎల్లా హోటల్​లోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా 48 గంటలుగా ఆ హోటల్​లోనే ఉన్నారు.

సీనియర్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ మాత్రం హోటల్ నుండి కదల్లేదు. హోటల్ నుండే పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం జరిపారు. ప్రభత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారితో కొంతమేర డిస్కషన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలు అమలుపై చర్చించారట. ఇక రేవంత్ రెడ్డి నీ కలవడానికి ఉన్నత అధికారులు ఎల్లా హోటల్ కు క్యూ కడుతున్నారు. బొకేలు ఇచ్చి రేవంత్ కు విషెష్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ లో రేవంత్ రెడ్డి వుండే రూమ్ కు పోలీసులు భారీగా భద్రత పెంచారు. మరోవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఉత్తమ్ ,భట్టి లకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు కేటాయించినట్లు సమాచారం.

Also Read: Revanth Reddy CM : రేవంత్ రెడ్డి ని సీఎం గా తేల్చేసిన రాహుల్ ..!