Site icon HashtagU Telugu

Revanth Reddy: మంత్రి మల్లారెడ్డిని ఓ రేంజ్ లో ఉతికారేసిన రేవంత్ రెడ్డి..!!

Revanth Malla Reddy

Revanth Malla Reddy

టీపీసీసీ అధ్యక్షుడు…రేవంత్ రెడ్డి దూకుడు పెంచాడు. ఇక రేవంత్ రెడ్డి మాటల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటలు…ఎదుటోని గుండెల్లో గుచ్చినట్లు ఉంటాయి. ఏ విషయమైనా టార్గెట్ చేస్తే…ఆ విషయాన్ని తొక్కతీసి నోట్లో పెట్టినట్లుగా వివరంగా చెప్పేస్తుంటారు. ఎంతలా అంటే…వాస్తవం అనే భావన కలిగేలా. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ధీటుగా మాటలు మాట్లాడే సత్తా రేవంత్ రెడ్డి లో ఉంది. ఆయన ఎంతసేపు మాట్లాడినా…ఆసక్తికరంగానే ఉంటుంది. తాను టార్గెట్ చేసినవారిలో మాత్రం..గుండెల్లో రైలు పరుగెడుతుంటాయి. ఏది చెప్పిన సుత్తిలేకుండా…స్ట్రెయిగ్ చెప్పేస్తుంటారు.

లేటెస్టుగా రేవంత్ రెడ్డి..మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేశాడు. ఆయన పై సంచలన ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగలేదు…మల్లారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అచ్చొసిన ఆంబోతులా మల్లారెడ్డి తయారయ్యారంటూ పవర్ ఫుల్ పంచ్ లతో మొదలు పెట్టిన రేవంత్…రెవెన్యూ చట్టాన్ని అడ్డంపెట్టుకుని వందలాది ఎకరాలు కాజేశారంటూ ఆరోపించారు. దానికి సంబంధించి కొన్ని సాక్ష్యాలను కూడా వివరించారు.

మూడుచింతలపల్లి కేశవాపూర్ లో మంత్రి మల్లారెడ్డి 150ఎకరాలు కాజేసిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డి అక్రమాలు, అరాచకాలన్నీంటిని బయటకు తీస్తాం. విచారణ జరిస్తాం. బొక్కలో వేస్తాం. ఏసీబీ విజిలెన్స్ ద్వారా విచారణ జరిపిస్తామంటూ పేర్కొన్నారు. అంతేకాదు మల్లారెడ్డి..ఆయన అల్లుడిని ఊచలు లెక్కిపెట్టిస్తామంటూ విమర్శించారు.

గుండ్లపోచంపల్లిలో పార్కును తొలగించి రోడ్డును వేసుకున్నాడు. ఆయన అల్లుడు చెరువును కబ్జా చేసి కాలేజ్ నిర్మించాడు. జవహర్ నగర్ లోప్రభుత్వ భూమి కబ్జా చేయడం…ఇవన్నీంటిని తాము అధికారంలోకి రాగానే…ఆధారలతోసహా నిరూపిస్తామని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మల్లారెడ్డి, ఆయన అల్లుడిపై రేవంత్ రెడ్డి చేసిన అరోపణలు ఇప్పుడు హాట్ టాపిగ్గా మారాయి. రేవంత్ మాటలకు మల్లారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.