Site icon HashtagU Telugu

Komatireddy Rajagopal reddy : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నట్టెట ముంచడం ఖాయం…!!

komatireddy rajgopal

komatireddy rajgopal

రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డిని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మునగడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డి చరిత్ర లేదని విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి రాయజకీయాల్లోకి రాకముందు దొంగతనాలు చేసేవారని హాట్ కామెంట్స్ చేశారు. నల్లగొండ జిల్లా గట్టుప్పల్ లో బీజేపీ బహిరంగసభకు హాజరైన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేరడం లేదన్న రాజగోపాల్ రెడ్డి…కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రమే తెలంగాణ డెవలప్ అయ్యిందని విమర్శించారు. మునుగోడు డెవలప్ మెంట్ కోసం ఎన్నోసార్లు ప్రయత్నించాని…అసెంబ్లీలో మునుగోడు సమస్యల గురించి ప్రశ్నించానన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేను కాబట్టి మునుగోడు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయలేదని చెప్పారు. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…టీఆర్ ఎస్ కు అమ్ముడుపోయారన్నారు. స్వార్థం కోసం, పదువుల కోసం, డబ్బు కోసం తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి. తాను రాజీనామా చేయడంతోనే రాష్ట్రవ్యాప్తంగా పించన్లు మంజూరు అయ్యాయన్నారు. తన రాజీనామాతోనే మునుగోడు నియోజవర్గంలో రోడ్లు, గట్టుప్పల్ మండలంగా ఏర్పడిందన్నారు. నియోజకవర్గం డెవలప్ అవ్వాలన్న ఆకాంక్షతోనే తాను రాజీనామాకు సిద్దపడ్డానని రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.