‘సెంచరీ’ కొట్టిన రేవంత్ రెడ్డి.. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం!

‘దుమ్ము పట్టిపోతున్న నేను సంచలన వార్తనవుతాను’ అన్నాడో ఓ కవి. ఈ మాటలు అక్షరాల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అతికినట్టుగా సరిపోతాయి. ఎవరూ ఊహించలేదు ఓ మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి టీపీసీసీ బాధ్యతలు స్వీకరిస్తారని..

  • Written By:
  • Updated On - October 26, 2021 / 03:51 PM IST

‘దుమ్ము పట్టిపోతున్న నేను సంచలన వార్తనవుతాను’ అన్నాడో ఓ కవి. ఈ మాటలు అక్షరాల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అతికినట్టుగా సరిపోతాయి. ఎవరూ ఊహించలేదు ఓ మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి టీపీసీసీ బాధ్యతలు స్వీకరిస్తారని.. ఏ కార్యకర్త కూడా అనుకోలేదు మళ్లీ కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొస్తారని.. ఇతర పార్టీలు సైతం ఇక అధికారిక పార్టీ టీఆర్ఎస్ కొట్టే మొనగాడే లేరని అనుకుంటున్న తరుణంలో ఉప్పెనలా దూసుకొచ్చారు రేవంత్ రెడ్డి. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి 100 రోజులైన సందర్భంగా రేవంత్ రెడ్డి గురించి కొన్ని విషయాలు..

ఇతర పార్టీ నుంచి వచ్చి టీపీసీసీగా బాధ్యతలు చేపట్టి నేటికీ వంద రోజులు పూర్తిచేసుకున్నవాళ్లలో మొదటగా రేవంత్ రెడ్డి నిలుస్తారు. అతి తక్కువ సమయంలో సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ఊపిరీలేని పార్టీని ఊపిరిపోశాడు. ముఖ్యంగా దళిత గిరిజన ఆత్మగౌరవ సభలతో జనాల్లోకి వెళ్లారు. ఇంద్రవెళ్లి స్థూపం సాక్షిగా లక్షమందితో సభ సక్సెస్ చేసి కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ధైర్యం నింపారు. ఇబహ్రీంపట్నంలోని రావిర్యాల సభతో టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ముచ్చెటమలు పట్టించారు. విమర్శించినోళ్లు సైతం గజ్వేల్ సభతో రేవంత్ రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. ‘నిరుద్యోగ సైరన్’ పేరుతో పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ జెండా రెపరెలలాడించారు. రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా వేలాదిమంది జనాలు హాజరై సభలను విజయవంతం చేశారు. ఇదే ఊపుతో హుజురాబాద్ లో తనదైన స్టైయిల్ అధికార పార్టీకి దడ పుట్టించారు. డిపాజిట్ సైతం రాదని విమర్శించినవాళ్లకు గెలిచి చూపిస్తానని సవాల్ విసిరారు. ఎంతోమంది ఛీకొట్టినా, విమర్శించినా వారిని సైతం కలుపుకొని ముందుకుసాగాడు.

టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన భూ కబ్జాలను బయటకు తీసి అధికార పార్టీకి తానేంటో రుచి చూపించారు. డ్రగ్స్ కేసులో ‘వైట్ చాలెంజ్’ పేరుతో అమరవీరుల స్తూపం సాక్షిగా కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఈ ఒక్క చాలెంజ్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. టీఆర్ఎస్సే డ్రగ్స్ ఎంకరేజ్ చేస్తోందని పక్కా ఆధారాలతో బయటపెట్టారు. ఈ చాలెంజ్ తో టీఆర్ఎస్ నాయకులంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. కాంగ్రెస్ 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని, టీఆర్ఎస్ పార్టీనే అంటేనే కొనుగోలు పార్టీ అని, అలాంటి నీచ రాజకీయాలకు తాను స్వస్వి చెప్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘టీఆర్ఎస్ హఠావో, తెలంగాణ బచావో’ అనే నినాదంతో ఢిల్లీ ముఖ్యనేతలను కూడా ఆకట్టుకున్నారు.

కాంగ్రెస్ అంటేనే ‘రెడ్ల పార్టీ’గా పేరుండటంతో, ఆ అపవాదును పూర్తిగా తుడ్చేసి అందరి పార్టీగా తీర్చిదిద్దారు. చిన్న, చిన్న సమస్యలను సైతం పరిష్కరించి హైలైట్ గా నిలిచారు. కార్యకర్తలకు ఆపదే వస్తే ఎక్కడికా వెళ్తానని అసలైన నాయకుడిగా పేరు తెచ్చకున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నాయకులు దూరంగా ఉన్నా, జగ్గారెడ్డి లాంటివాళ్లు విమర్శించినా.. వాళ్లందరినీ కలుపునిపోతూ కాంగ్రెస్ బాస్ గా పేరు సంపాదించారు. ఇప్పటికీ కాంగ్రెస్ సీనియర్ల సలహాలు తీసుకున్నా తర్వాతనే పార్టీ కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు. టీఆర్ఎస్ కే బీజేపీ ప్రధాన పక్షం అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ ప్రత్యామ్నయ పార్టీ గా తీర్చిదిద్దారు. సోనియా, రాహుల్ గాంధీ సూచనలతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తానని అంటున్నారు రేవంత్ రెడ్డి.