మంచిగ ఉన్న సింగరేణిని ఒకప్పుడు ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని ..ఇప్పుడు మరోసారి రేవంత్ రెడ్డి సింగరేణిని ముంచేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు గులాబీ బాస్ కేసీఆర్. ఈసీ నిషేధం తర్వాత ఈరోజు సాయంత్రం 8 గంటలకు కేసీఆర్ తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్బంగా రామగుండంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ , బిజెపి సర్కార్ లపై విమర్శలు కురిపించారు. సింగరేణి మన తెలంగాణ ఆస్తి అని.. వంద శాతం మనకే ఉండేదని , కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లోకి పంపించి.. ఆ అప్పు తిరిగి చెల్లించలేక 49 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అదే బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు ఎన్నో లాభాలు తెచ్చామని గుర్తు చేసారు. డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి.. 19 వేల మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చామని.. సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( సిమ్స్ )పేరు మీద మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. ఆ మెడికల్ కాలేజీలో ఐదు శాతం కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చేలా చేసుకున్నామని తెలిపారు. కానీ ఇప్పుడు సింగరేణికి పెద్ద ప్రమాదం రాబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
మంచిగ ఉన్న సింగరేణిని ఒకప్పుడు ముంచిన కాంగ్రెస్ .. ఇప్పుడు మరోసారి మోడీతో కలిసి రేవంత్ రెడ్డి సింగరేణిని ముంచేందుకు కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులు దీని గురించి ఆలోచించాలని.. కార్మికుల పక్షాన ఉన్న బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 200 సీట్లు వచ్చే పరిస్థితి లేదని వార్తలు వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీ గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్నది. అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీలని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టే సమయం వచ్చింది. బీఆర్ఎస్ బలంగానే ఉంటేనే కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు నెరవేరుస్తది. కాబట్టి విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Read Also : KCR: కాంగ్రెస్ త్వరలో భూస్థాపితం: కేసీఆర్