Revanth Reddy : మేం అధికారంలోకి వ‌స్తే బీసీ కుల‌గ‌ణ‌న‌-రేవంత్‌

బీసీ కులగణన చేయాలనే డిమాండ్ తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాలు ధర్నా చేశాయి.ఈ ధర్నాకు మద్దతు తెలిపిన టీపీసీసీ చీఫ్ రేవంత్ బీసీ కులగణన తప్పకుండా చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

బీసీ కులగణన చేయాలనే డిమాండ్ తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాలు ధర్నా చేశాయి.ఈ ధర్నాకు మద్దతు తెలిపిన టీపీసీసీ చీఫ్ రేవంత్ బీసీ కులగణన తప్పకుండా చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ ఎంపీలు బీసీల గూర్చి ఎందుకు మాట్లాడటం లేదని,జంతర్ మంతర్లో తెలంగాణ బీసీలు ధర్నా చేస్తుంటే తొమ్మిది మంది ఎంపీలు ఏం చేస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అంటే బడుగు బలహీన వర్గాల ద్వారానే అని తెలిపిన రేవంత్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు.

బీసీ కుల గణన చేయడం వల్ల బీసీ విద్యార్ధులు ఉద్యోగాలు పొందే హక్కు ఉంటుందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీల కుల లెక్కలు చేపట్టిందని రేవంత్ గుర్తుచేశారు. దేశానికి ప్రధానమంత్రి బీసీ అయినప్పటికీ బీసీలకు అన్యాయం జరుగుతోందని, బలహీన వర్గాల మద్దతు లేకుండా బీజేపీ అధికారంలోకి వచ్చిందా అని రేవంత్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీసీ అయ్యాక బీసీల గురించి పట్టించుకోవడం లేదని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కులగణన చేపడతామని, బీసీల అంశంపై పార్లమెంటులో పోరాడుతమని, ఈ డిమాండ్ తో పోరాడేవాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని రేవంత్ హామీ ఇచ్చారు.