Revanth Offer to Rahul : రాహుల్ కు రేవంత్ బంప‌ర్ ఆఫ‌ర్

రాహుల్ గాంధీకి రేవంత్ బంప‌ర్ ఆఫ‌ర్ (Revanth Offer to Rahul) ఇవ్వ‌డం ఏమిటి?

  • Written By:
  • Publish Date - March 28, 2023 / 05:19 PM IST

రాహుల్ గాంధీకి రేవంత్ బంప‌ర్ ఆఫ‌ర్ (Revanth Offer to Rahul) ఇవ్వ‌డం ఏమిటి? ఇస్తేగిస్తే రేవంత్ కు రాహుల్ ఆఫ‌ర్ ఏదైనా ఇవ్వాలిగానీ అని అనుకుంటున్నారు క‌దా. నిజ‌మే, ప‌రిస్థితులు ఒక్కోసారి బండ్ల‌ను ఓడ‌లు, ఓడ‌ల్ని బండ్లు చేస్తాయంటారు పెద్ద‌లు. ఆ సామెత‌గా రాహుల్ గాంధీని తన బంగ‌ళాలో ఉండొచ్చ‌ని ఓపెన్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ కు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్ ఇదే. త‌న ఇంటికి వ‌చ్చి ఉండొచ్చ‌ని ట్వీట్ (Tweet for home)చేశారు. ఆ ట్వీట్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. అన‌ర్హ‌త‌కు గురైన రాహుల్ ఢిల్లీలోని ఆయ‌న ఇంటిని ఖాళీ చేయాల‌ని కేంద్రం ఆదేశించింది. దీంతో ఖాళీ చేయ‌డానికి సిద్ధ‌మైన రాహుల్ కు ఆశ్ర‌య‌మిస్తూ త‌న ఇంటికి రావాల‌ని ట్విట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

రాహుల్ గాంధీకి రేవంత్ బంప‌ర్ ఆఫ‌ర్ (Revanth Offer to Rahul)

ప్ర‌స్తుతం ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయ‌న‌కు ఢిల్లీలో ఎంపీ హోదాలో ఒక ఇంటిని కేటాయించింది. ప్ర‌స్తుతం దానిలో ఉంటోన్న రేవంత్ తాజాగా రాహుల్ ను కూడా (Revanth Offer to Rahul) ఆహ్వానించారు. త‌న ఇంటిలో ఉండొచ్చ‌ని ట్వీట్ చేయ‌డం పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ జ‌రుగుతోంది. స‌హ‌జంగా చేసిన రేవంత్ ట్వీట్ ను ప‌లు ర‌కాలుగా తీసుకుంటున్నారు. కొంద‌రు లైట్ గా తీసుకుంటుండ‌గా, మ‌రికొంద‌రు రాహుల్ కు ఇంటిని రమ్మ‌నేంత లీడ‌ర్ అయ్యాడా? అంటూ లోలోన ఆగ్ర‌హిస్తున్నారు. స‌హ‌జంగా రేవంత్ రెడ్డి అంటేనే మండిప‌డే తెలంగాణ సీనియ‌ర్లు ఇప్పుడు ఆయ‌న చేసిన ట్వీట్ (Tweet for home)ను ప‌లు కోణాల నుంచి చూస్తున్నారు. సీనియ‌ర్ల‌ను హోంగార్డులుగా పోల్చిన విష‌యాన్ని గుర్తు చేసుకుంటూ గాంధీ కుటుంబానికి ఢిల్లీలో ఇళ్ల లేనట్టుగా రేవంత్ ట్వీట్ చేయ‌డం ఏమిటి? అంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

ఏప్రిల్ 23 లోగా ఖాళీ చేయాలని రాహుల్ కు నోటీసుల

పార్లమెంట్ సభ్యులకు కేటాయించే అధికారిక బంగళాను ఖాళీ చేయాలంటూ రాహుల్ కు కేంద్రం జారీ చేసిన నోటీసులపై ప‌లు ర‌కాలుగా పార్టీలు కూడా స్పందిస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా తాజాగా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ నోటీసులకు కట్టుబడి ఉంటానన్న ఆయన బంగళా ఖాళీ చేస్తానంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. మోదీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్ దోషిగా తేలడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం కూడా ఆటోమేటిక్‌గా రద్దయిపోయిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఎంపీగా ఆయనకు గతంలో కేటాయించిన అధికారిక భవనాన్ని కూడా ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 23 లోగా ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లో రాహుల్ అధికారిక నివాసం ఉంది.

Also Read : Rahul Disqualified : విప‌క్షాలు ఏకం! కాంగ్రెస్ తో TMC, BRS!!

కేంద్ర నోటీసులకు రాహుల్ తాజాగా స్పందించారు. ‘‘నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నేను ఇక్కడే గడిపాను. ఈ భవనంతో ఎన్నో మధురస్మృతులు ముడిపడి ఉన్నాయి. వాటన్నిటికీ కారణం ప్రజలే’’ అని ఆయన తన లేఖలో రాసుకొచ్చారు. ప్రభుత్వం తనకు పంపిన నోటీసులో అంశాలకు కట్టుబడి ఉంటానని కూడా రాహుల్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తొలిసారిగా 2004లో ఎంపీగా పార్లమెంటులో కాలుపెట్టారు. 2005 నుంచి తుగ్లక్ లేన్‌లోని బంగళాలో ఉంటున్నారు. ఇప్పటివరకూ ఆయన నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంటే 20ఏళ్ల నుంచి ఆ బంగ‌ళాలో నివాసం ఉంటున్నారు. అందుకే, ఆ బంగ‌ళాతో అనుబంధం పెంచుకున్నారు. అయిన‌ప్ప‌టికీ దాన్ని ఖాళీ చేస్తానంటూ కేంద్రానికి లేఖ రాశారు.

Also Read : Telangana Congress: ఎంపీ పదవులకు రేవంత్, కోమటిరెడ్డి రాజీనామా?

భావోద్వేగాల నడుమ బంగ‌ళా ఖాళీ చేస్తానంటూ రాహుల్ కేంద్రానికి లేఖ రాశారు. దాన్ని చూసిన కాంగ్రెస్ ఎంపీలు సానుభూతి కోణం నుంచి చూస్తున్నారు. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం త‌న బంగ‌ళాలో ఉండొచ్చంటూ(Revanth offer to Rahul) విచిత్ర‌మైన ట్వీట్ చేయ‌డం ఢిల్లీ వేదిక‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. గాంధీ కుటుంబానికి ఢిల్లీలో ఇళ్లు లేదా? అందుకే, రేవంత్ రెడ్డి ఆయ‌న ఇంటిని ఇస్తారా? స‌హ‌చ‌ర ఎంపీ అయిన‌ప్ప‌టికీ గాంధీ కుటుంబం నుంచి వ‌చ్చిన రాహుల్ కు ఆ విధ‌మైన ట్వీట్ (Tweet for home)చేయ‌డం ఏమిటి? అంటూ సీనియ‌ర్ ఎంపీలు మ‌న‌సునొచ్చుకుంటున్నారు. రేవంత్ స‌హ‌జ‌ధోరణిలో ఆ ట్వీట్ చేశారు. కానీ, రాద్దాంతంగా ఆ ట్వీట్ మార‌డంతో తెలంగాణ సీనియ‌ర్లు ఇప్పుడు ప్ర‌త్యేక లుక్ ఢిల్లీ మీద వేశారు.

Also Read : Rahul Issue : విప‌క్షాల్లో రాహుల్ `సావ‌ర్క‌ర్` ప్ర‌కంప‌న‌లు