Telangana Election 2023 : కాంగ్రెస్ కు 85 సీట్లు.. తేల్చేసిన రేవంత్ సర్వే

కాంగ్రెస్ పార్టీ 80 నుండి 85 సీట్లు సాదించబోతుందని అందులో సందేహమే అక్కర్లేదని రేవంత్ చెప్పుకొచ్చారు

  • Written By:
  • Updated On - November 21, 2023 / 11:45 AM IST

ఈసారి తెలంగాణ ఎన్నికల (Telangana Election 2023) వేడి మాములుగా లేదు..గత రెండుసార్లు జరిగిన ఎన్నికలు ఓ లెక్క..ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఓ లెక్క అన్నట్లు ఉంది. పదేళ్ల బిఆర్ఎస్ (BRS) పాలన చూసిన రాష్ట్ర ప్రజలు (Telangana Voters) ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా (Sonia Gandhi) కు రిటర్న్ గిఫ్ట్ కాంగ్రెస్ విజయం తో ఇవ్వాలని ప్రజలు చూస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు (Congress Leaders)చెపుతున్నారు. బిఆర్ఎస్ పాలన లో రాష్ట్రం అప్పుల్లో కురుకపోయిందని..ప్రతి తెలంగాణవాడి ఫై అప్పు భారం మోపిందని చెపుతున్నారు. ప్రాజెక్టు ల పేరుతో వేలాదికోట్లు కల్వకుంట్ల ఫ్యామిలీ వారు వారి అకౌంట్ లలో వేసుకున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ను తెచ్చిన నిరుద్యోగులను రోడ్డున పడేసిన వ్యక్తి కేసీఆర్ అని..అలాంటి వ్యక్తిని ఈసారి గద్దె దించాలని యువత అంత ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ చెపుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే విషయాన్నీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) హైద్రాబాద్ లో జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన మీట్ ది ప్రెస్ (Revanth Reddy Meet The Press) కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హంగ్ వచ్చే సమస్యే లేదని , ఆ చర్చే అవసరం లేదని రేవంత్ తేల్చి చెప్పారు. తమకు సంపూర్ణ మెజారిటీ వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడం కాంగ్రెస్ విధానమన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భవన్ గా మారుస్తామన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తెలంగాణ ప్రజలు ప్రపంచంతో పోటీ పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కేసీఆర్ లా ఉన్నవాటిని కూల్చి కొత్తవాటిని కట్టే విధానాలకు కాంగ్రెస్ స్వస్తి పలుకుతుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ 80 నుండి 85 సీట్లు సాదించబోతుందని అందులో సందేహమే అక్కర్లేదని రేవంత్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఆస;లు ఉద్యమకారుడే కాదని , ఫక్తు రాజకీయ నాయకుడని రేవంత్ విమర్శించాడు. నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి పడుతుందని రేవంత్ జోస్యం చెప్పారు. ప్రజలు అధికారం ఇచ్చేది వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కాదన్నారు.టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ అంశంలో సిట్ విచారణ నిస్పాక్షికంగా లేదని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారు. జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన ఎస్ఎల్బీసీ ని పూర్తి చేస్తామని ఆయన హమీ ఇచ్చారు. నక్సలైట్ల ఎజెండాను అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీయేనని ఆయన చెప్పారు.కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందన్నారు.కాంగ్రెస్ పాలనలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
కేసీఆర్ పాలనలో ఉన్నట్టుగా నిర్బంధాలు ఉండవన్నారు. కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డు ఇచ్చి ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Read Also : Telangana Election 2023 : కాంగ్రెస్ అభ్యర్థులకు హైకమాండ్ వార్నింగ్..