తుక్కుగూడ కాంగ్రెస్ సభ(Tukkuguda Congress Sabha)లో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..ప్రత్యర్థి పార్టీలకు తన మాటలతో చెమటలు పట్టించాడు. ప్రత్యర్థి పార్టీల ఫై రేవంత్ రెడ్డి ఏ రేంజ్ లో డైలాగ్స్ వదులుతారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్న, రాష్ట్రానికి సీఎం గా ఉన్న..తన మాటల్లో ఏమి తేడాలేదు. భారీ డైలాగ్స్ , కౌంటర్లు , విమర్శలు చేయడంలో రేవంత్ తర్వాతే ఎవరైనా అని చాలామంది అభిప్రాయపడతారు. ముఖ్యంగా బిఆర్ఎస్ నేతలపై ఆయన వదిలే డైలాగ్స్ కాంగ్రెస్ శ్రేణులకు భలే కిక్ ఇస్తాయి. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కూడా రేవంత్ స్పీచ్లే.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హోరు నడుస్తున్న క్రమంలో రాష్ట్రంలో 17 కు 17 లోక్ సభా స్థానాలను కైవసం చేసుకోవాలని రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో నేడు కలిసొచ్చిన అడ్డాలో భారీ సభ నిర్వహించారు. తుక్కుగూడ లో జనజాతర పేరుతో భారీ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం..ప్రత్యర్థి పార్టీల్లో ఆందోళన పెంచారు. ఇక ఈ సభలో రేవంత్ తనదైన స్పీచ్ తో అదరగొట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే బిఆర్ఎస్ (BRS) ను ఓడించామో..ఈసారి బిజెపి (BJP) ని కూడా అలాగే ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని, కార్యకర్తల కష్టం వల్లే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ఈ సందర్బంగా మరోసారి గుర్తు చేసారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి..మోడీ మోసం చేసారని, ఈ పదేళ్లలో మోడీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నిరుద్యోగులకు అన్యాయం చేసారని చెప్పుకొచ్చారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ లో రైతులు 17 నెలలు పోరాడారని , ఈ పోరాటంలో 750 మంది రైతులు చనిపోయారని..ఆ చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం సరికదా, కనీసం పరామర్శ కూడా చేయలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇదే సందర్బంగా తెలంగాణ ను పదేళ్లుగా పాలించిన మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఫై కూడా నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఏమాట్లాడిన చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నారేమో..నేను జానారెడ్డిని కాదు..రేవంత్ రెడ్డిని..ఎలాపడితే..అలామాట్లాడితే..చర్లపల్లి జైల్లో వేస్తాం..ఆయనకు జైల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏదో కాలు విరిగిందని , కూతురు జైల్లో ఉందని జాలి చూపిస్తున్నాం అంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.
Read Also : JP Nadda : రాజ్యసభ సభ్యుడిగా జేపీ నడ్డా ప్రమాణం