Site icon HashtagU Telugu

CM Revanth Reddy : పార్లమెంట్‌లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి – సీఎం రేవంత్

Revanth Kosgi

Revanth Kosgi

పార్లమెంట్‌ (Parliament)లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. 14 పార్లమెంటు సీట్లు గెలిస్తేనే యుద్ధంలో కాంగ్రెస్‌ గెలిచినట్లని కోస్గి (Kosgi Public Meeting ) బహిరంగ సభలో సీఎం రేవంత్ (CM Revanth Reddy) పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలని , ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. బుధువారం నారాయణపేట్ జిల్లా కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. రూ.4,369 కోట్ల విలువైన పనులను ఆయన ప్రారంభించారు. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం, మెడికల్, నర్సింగ్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆనాడు వలస వచ్చిన కేసీఆర్ ను పాలమూరు ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ వచ్చాక ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని విమర్శించారు. ‘పాలమూరుకు రూ.27వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. ఉమ్మడి ఏపీలో జలదోపిడీ కంటే కేసీఆర్ సీఎం అయ్యాకే ఎక్కువ దోపిడీ జరిగింది’ అని రేవంత్ మండిపడ్డారు. ‘ఇంకా యుద్ధం ముగియలేదని, ప్రస్తుతం విరామం మాత్రమే వచ్చిందని , పార్లమెంట్‌లో పట్టు సాధిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని రేవంత్ చెప్పుకొచ్చారు. 14 పార్లమెంటు సీట్లు గెలిస్తేనే యుద్ధంలో కాంగ్రెస్‌ గెలిచినట్లని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్​ఎస్​ ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు.

మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి తెలిపారు. ఐకేపీ, మహిళా సంఘాల ద్వారా పంటలు కొనుగోళ్లు చేస్తామన్నారు. ‘కుటుంబం ఆర్థికంగా బాగుపడాలంటే నగదు ఆడబిడ్డల చేతుల్లోనే ఉండాలి. మగవారికి ఇస్తే సాయంత్రం బెల్ట్ షాపుల్లో ఖర్చు పెడతారు. భవిష్యత్తులో సున్నా వడ్డీ విధానాన్ని అమలు చేస్తాం. మిమ్మల్ని లక్షాధికారి కాదు.. కోటీశ్వరుల్ని చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం’ అని తెలిపారు.

Read Also : Surya Kanguva : కంగువ కోసం సూర్య ఏం చేస్తున్నాడో తెలుసా..?