తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి రావడం వల్ల ఆ పార్టీ పూర్తిగా కూలిపోయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పునరుజ్జీవన కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే నీటి సెంటిమెంట్‌ను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫామ్ హౌస్‌లో క్షుద్ర పూజలు చేయడం వంటివి చేసి బీఆర్ఎస్‌ను బతికించాలన్న ఆశతో కేసీఆర్ ఉన్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసారు.
Karnataka : కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు.. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కలకలం..
తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో జరిగిన అన్యాయం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పునాది వేసిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో నీటి హక్కుల కోసం పోరాడలేదని ఆరోపించారు. 2015లో కేసీఆర్ 299 టీఎంసీలకు సంతకం చేసి, 68% నీటిని ఏపీకి వదిలిపెట్టిన దాన్ని “తెలంగాణకు మరణశాసనం”గా అభివర్ణించారు. ఇది రాష్ట్రానికి భారంగా మారిందన్నారు. కేంద్రం కూడా ఈ సమస్యపై స్పందించలేదని వాపోయారు. అప్పటి పాలకులు కమీషన్ల కోసం ప్రాణహిత-చేవెళ్లను వదిలేసి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, దానితో రాష్ట్రానికి ప్రయోజనం కంటే నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.
Megastar : ఊహకందని స్థాయిలో మెగాస్టార్ ‘విశ్వంభర’లో వీఎఫ్ఎక్స్ షాట్లు
కృష్ణా జలాల సద్వినియోగం కోసం కేసీఆర్ ఒక్క రోజు కూడా పోరాడలేదని సీఎం రేవంత్ తీవ్రంగా విమర్శించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రం గరిష్టంగా 220 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించలేదని గుర్తు చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తైతే మనకు వచ్చే వాటాను పూర్తిగా వినియోగించవచ్చన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చనిపోయినట్టే అని, అలాంటి పార్టీని బతికించేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్‌లో క్షుద్ర పూజలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల జలహక్కుల విషయంలో మాత్రం తమ ప్రభుత్వం రాజీ పడదని, అన్ని ముళ్లపట్టు దాటిన పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు.