సచివాలయం(Telangana Secretariat)లో మార్పులపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం రేవంత్ రెడ్డి వాస్తు (Vaastu Changes) పిచ్చితో సచివాలయంలో మార్పులు చేస్తూ ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని.. ఒక్క గేటు మార్పు కోసం ఏకంగా రూ.3.2కోట్ల దుబారా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు.
గ్రీన్ టెక్నాలజీతో, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ తో దేశానికే తలమానికంగా కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తే వాస్తు పిచ్చి అని గాయి గాయి.. గత్తర గత్తర చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా వాస్తు పిచ్చితో సెక్రటేరియట్ లో పూటకో మార్పు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మార్క్ మార్పు అంటే ఇదేనని.. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చేశారు. సెక్రటేరియట్ సింహద్వారం మార్పు, రెండు గేట్లను అనుసంధానిస్తూ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తుండటంపై మండిపడ్డారు.
తెలంగాణ సచివాలయానికి సంబంధించి..సీఎం రేవంత్ వాస్తు మార్పులు చేయాలనీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈశాన్య దిశలో కొత్త గేట్‌ను నిర్మించేందుకు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.3.2 కోట్ల టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా సచివాలయపు బాహుబలి గేట్లకు ఎదురుగా ఉన్న మెయిన్ గేటును పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హుస్సేన్ సాగర్ గేటు నుంచి ప్రవేశించి, గేట్ 3 ద్వారా ముఖ్యమంత్రి బయటికొచ్చేందుకు కొత్త మార్గం ఏర్పడుతుంది. ఎన్టీఆర్ మార్గ్ ఎంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ గేటు వరకు కొత్త రోడ్డు నిర్మాణం చేయబడుతుంది. అలాగే గేట్ నెంబర్ 3 కి ఎదురుగా హుస్సేన్ సాగర్ వైపు మరో కొత్త గేటును ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. గతంలో మూసిన ప్రధాన ద్వారాన్ని పూర్తిగా తొలగించే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నారు. ఈ మార్పులు చేయడాన్ని బిఆర్ఎస్ నేతలు తప్పు పడుతూ..ప్రజల సొమ్మును ఇలా వృధా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : TRAVANCORE DEVASWOM BOARD: అయ్యప్ప భక్తులకు షాక్? ఇకపై ఇరుముడిలో ఇవి బ్యాన్!