Delhi Tour : ఢిల్లీలో ముఖమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. మంగళవారం ఉదయం కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. అరగంట పాటు సాగిన సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీ, ధాన్యం సేకరణ, సరఫరాకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది. రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.
Read Also: Telangana MLC Results : బీజేపీ గెలుపు, బీఆర్ఎస్‌కు సంక్షోభం
2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రికి వినతి చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 343.27 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్ డెలివరి గడువును పొడిగించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఇక, సాయంత్రం సీఎం రేవంత్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తోనూ భేటీ కానున్నారు.పెండింగ్ ప్రాజెక్టులు, పలు అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైల్ ఫేజ్-2,రీజినల్ రింగ్ రోడ్డు, ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. ఆ తర్వాత రేవంత్ ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
కాగా, తెలంగాణలో ఎక్కడా కూడా గత పదేళ్లుగా రేషన్ కార్డు అమలుకాలేదని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు రేషన్ కార్డులను ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ముమ్మరం చేశారు. రేషన్ కార్డుల కోటా కింద రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ధాన్యం, సబ్సీడీని కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో పెండింగ్‌లో ఉన్న నిధులతో పాటు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులపై కూడా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. దేశంలో ధాన్యం సేకరణలో పంజాబ్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో హర్యానా, మూడో స్థానంలో తెలంగాణ ఉంది.
Read Also: Telangana MLC Results : బీజేపీ గెలుపు, బీఆర్ఎస్‌కు సంక్షోభం