Site icon HashtagU Telugu

Tummala Nageswara Rao : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన రేవంత్ సర్కార్

CM Revanth Reddy left for Delhi

CM Revanth Reddy left for Delhi

కష్టాలలో ఉన్న తెలంగాణ (Telangana) రైతులకు(Farmers) రేవంత్ సర్కార్ (Revanth Govt) గుడ్ న్యూస్ తెలిపింది. రైతు భరోసా, పంటల భీమా, రుణమాఫీ పథకం విధివిధానాలపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపి రైతుల్లో సంతోషం నింపారు. ఈ ఏడాది వర్షపాతం లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా కరువు పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా వర్షాలు పడకపోయేసరికి పంటలు ఎండిపోయాయి. బోర్లు , బావులు ఎండిపోయి..రైతులకు కన్నీరు మిగిల్చాయి. దీంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదే క్రమంలో లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాని ఇరకాటంలో పెట్టాలని చూస్తుంది. కరువు, నీరు లేకపోవడం ఇవన్నీ ఎత్తిచూపిస్తూ రైతులను రెచ్చగొడుతూ..ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. రోజు రోజుకు ప్రతిపక్ష పార్టీల విమర్శలు ఎక్కువ అవుతుండడం తో వాటిని చెక్ పెట్టె ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) కీలక ప్రకటన చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా, పంటల భీమా, రుణమాఫీ పథకం విధివిధానాలపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా, పంటల భీమా అమలుకు కవాల్సిన నిధుల సమీకరణపై మంత్రి తుమ్మల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు వ్యవసాయ పరపతి సంఘాలు, బ్యాంకుల నుంచి ఎవరైతే రైతులు పంట రుణాలు తీసుకున్నారో వారందని నుంచి డబ్బు రికవరీ కోసం ఇబ్బందులు పెట్టకూడదంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రానున్నది వర్షాకాలం కావడంతో కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

Read Also : Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక వృత్తాంతం