Site icon HashtagU Telugu

Ramadan : ముస్లిం ఉద్యోగులకు రేవంత్ గుడ్‌న్యూస్

CM Revanth

CM Revanth

ముస్లిం ఉద్యోగులకు (Muslim Employees) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. రంజాన్ మాసాన్ని (Ramadan ) పురస్కరించుకుని ప్రత్యేక సడలింపులు ప్రకటించారు. ముస్లింల పవిత్ర నెల అయిన రంజాన్ సమయంలో వారికీ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా, రోజువారీ పనిభారాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ వర్కర్లు, అన్ని శాఖల ముస్లిం సిబ్బంది పని సమయాన్ని గంట ముందుగా ముగించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

New Ration Carts : ఎన్నికల కోడ్‌ అమలులో లేని జిల్లాల్లో కొత్త రేషన్‌ కార్డులు : సీఎం రేవంత్‌ ఆదేశం

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే అవకాశం పొందనున్నారు. తద్వారా వారు ఇఫ్తార్ కార్యక్రమాల్లో పాల్గొని, రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి తగిన సమయం దొరుకుతుంది. ముస్లిం ఉద్యోగుల మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాదీ ఇలాంటి సడలింపులు ఇస్తూ వస్తోంది. ఈ సంప్రదాయాన్ని కొత్త ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి సర్కార్ కూడా కొనసాగించడం ముస్లిం ఉద్యోగులకు ఎంతో సంతోషకరమైన విషయం.

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రజల కోసం ప్రభుత్వంలో మరిన్ని చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రంజాన్ వేడుకల సందర్భంగా మసీదుల వద్ద తగిన వసతులు కల్పించడం, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక రేషన్ సరఫరా వంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ముస్లిం కుటుంబాలకు ‘రంజాన్ తోఫా’ పేరుతో ప్రత్యేక కానుకలు అందించేవారు. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి. రంజాన్ మాసంలో మతపరమైన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు ఇప్పటికే సూచించినట్టు సమాచారం.

Exit mobile version