Lok Sabha Polls : బీజేపీని డకౌట్‌ చేసి.. గుజరాత్‌ను ఓడించాలని సీఎం రేవంత్ ప్రజలకు పిలుపు

విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం పేర్కొన్న పరిశ్రమలు, ప్రాజెక్టులను మోడీ సర్కారు రద్దు చేసిందని, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని విభజన చట్టంలో ఉన్నాయన్నారు

  • Written By:
  • Updated On - May 7, 2024 / 10:30 PM IST

లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. ఈరోజు హన్మకొండ లో కాంగ్రెస్ అభ్యర్థి కావ్య తరుపున ప్రచారం చేసారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. బిజెపి పార్టీ ఫై నిప్పులు చెరిగారు. బీజేపీని డకౌట్‌ చేసి.. గుజరాత్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం పేర్కొన్న పరిశ్రమలు, ప్రాజెక్టులను మోడీ సర్కారు రద్దు చేసిందని, కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని విభజన చట్టంలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన నిధులను మోదీ గుజరాత్‌కు తరలించారని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు రేవంత్. అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే తమ ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ అంటున్నారని… కానీ సీఎం పదవి నుంచి దిగిపోవడానికి తాను అల్లాటప్పాగా రాలేదని పేర్కొన్నారు. పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్ మళ్లీ వచ్చి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌లో మార్పు వస్తుందని భావించామని… రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాత ఓట్లు అడుగుతారని భావించామని… కానీ అదేమీ జరగలేదన్నారు.

వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదనలను తీసుకురావాలని సభా వేదికగా అధికారులను ఆదేశిస్తున్నాను. తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌ను తీర్చిదిద్దే బాధ్యత నాది. జరగబోయేది కేవలం ఎన్నికలు కావు. ఈ మహాసంగ్రామంలో కాకతీయ పౌరుషాన్ని చూపించి దిల్లీ సుల్తాన్‌లను ఓడించాలి. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకి లక్ష మెజారిటీ ఇవ్వాలి అన్నారు.

Read Also : Venkatesh : ఖమ్మంలో రఘురాం రెడ్డి గెలుపు ఖాయం – హీరో వెంకటేష్